Saturday 6 October 2012

రంగమ్మ కథ


"ఒసే దరిద్రపుగొట్టు మొహమా! వయ్యారంగా ఎంతసేపు వూడిచ్చస్తావే? స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టవే ముండా!" రంగమ్మ గొంతు గాండ్రించింది.

"ఆ! వస్తన్నా, వస్తన్నా. అయిపోవచ్చింది." చిన్నగా, సన్నగా సమాధానం.

"గంట నించీ అదే మాట చెప్పి చస్తన్నావు గదే శనిద్రప్ముండా!" మళ్ళీ గాండ్రింపు.

రాంబాబుకి చిర్రెత్తింది. చదువుతున్న పుస్తకం విసిరికొట్టి, రెండు చెవులు మూసుక్కూర్చున్నాడు. రాంబాబు అవస్థకి అతని భార్య ఇందిరకి నవ్వొచ్చింది. ఆమెకిదంతా అలవాటైపోయింది.

రాంబాబు బ్యాంక్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు. ఆర్నెల్ల క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకొచ్చాడు. మేడపైన రెండు బెడ్రూముల పోర్షన్. పిల్లల స్కూలుకి బాగా దగ్గర. ఇల్లు కూడా సౌకర్యంగా ఉంది.

ఇల్లు క్రింద భాగం ఇంటి ఓనర్లు ఉంటారు. భార్యా, భర్త. ఆయనకి డెబ్భైయ్యేళ్ళు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య రంగమ్మ. లావుగా, పొట్టిగా, గుండ్రంగా ఉంటుంది. వారి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.

రాంబాబుకి ఆ ఇల్లు నచ్చింది. పెరట్లో పెద్ద మామిడి చెట్టు. ఇంటి చుట్టూతా పిల్లలకి ఆడుకోడానికి కావలసినంత స్థలం. రాంబాబుకి పుస్తకాలు చదివే అలవాటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తాడు.

ఒక ఆదివారం కింద కేకలు, అరుపులు వినిపించాయి. రాంబాబు కంగారుపడ్డాడు. ఇల్లుగలావిడ పనిమనిషిని అరుస్తుందని ఇందిర చెప్పింది.

"ఈ రోజుల్లో పనిమనుషుల్ని ఇంత భయంకరంగా కోప్పడితే ఊరుకుంటారా?" ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

"ఆ అమ్మాయి పనిమనిషి కాదుట. రంగమ్మగారికి పొలం చాలా ఉందిట. వాళ్ళ పాలేరు కూతురు కుమారిని పనికి సాయంగా, తోడు కోసం తెచ్చుకున్నార్ట. ఆ అమ్మాయి అన్ని పనులూ చేస్తుంది. రంగమ్మగారికి కొద్దిగా కోపం." అంది ఇందిర.

"కొద్దిగానా? చాలానే ఉంది!" అంటూ నవ్వాడు రాంబాబు.

కుమారి చీపురుపుల్లలా ఉంటుంది. ఇంటిపనులు చురుకుగా, చకచకా చేసేస్తుంది. తెల్లారక ముందే కసువు చిమ్మేస్తుంది. ముగ్గులు పెడుతుంది. స్నానానికి వేణ్ణీళ్ళ కోసం బాయిలర్ వెలిగిస్తుంది. అంట్లు తోముతుంది. వంట చేస్తుంది. బట్టలుతుకుతుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళకి తినడం, పడుకోవడం తప్ప పనేమీ లేకుండా మరమనిషిలా అన్ని పన్లూ తానే చేసేస్తుంది.

రాంబాబు అప్పుడప్పుడూ బ్యాంక్ నుండి మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడు. ఆ సమయంలో కూడా కుమారి కిటికీలు, గ్రిల్స్ శుభ్రం చేస్తూ కనపడేది. రాంబాబు ఆ అమ్మాయి కనీసం కూర్చునుండగా ఎప్పుడూ చూళ్ళేదు. ఆ అమ్మాయిని చూస్తూ జాలి పడుతూ తన వాటా మెట్లెక్కే వాడు.

రాన్రాను రాంబాబుకి దిగులుగా అనిపించసాగింది. అతనికి రంగమ్మ ఒక రాక్షసిగానూ, కుమారి ఆ రాక్షసి చేపట్టిన రామచిలకలా అనిపించసాగింది. ఏం చెయ్యాలో తోచక - మన సంఘంలో పనిమనిషి పేరున జరుగుతున్న మానవహక్కుల అణచివేత గూర్చి ఇందిరకి ఉపన్యాసం చెప్పడం మొదలెట్టాడు. ఇందిర వింటూనే విసుక్కునేది.

ఒకసారి ఇంటిగలాయనకి జ్వరం వచ్చిందని తెలిసి పలకరించడానికి వెళ్ళాడు. ఆయనసలే బక్కప్రాణి. దీనికితోడు నాలుగైదు లంఖణాలు చేసినట్లున్నాడు.. బల్లిలా మంచానికి అతుక్కుపోయున్నాడు. రాంబాబుని చూసి నీరసంగా నవ్వాడు.

మంచానికి తల దగ్గరున్న చెక్క కుర్చీలో కూర్చునుంది రంగమ్మ. పెద్ద గాజు గ్లాసు నిండా బత్తాయి రసం. చప్పరిస్తూ నిదానంగా తాగుతుంది. ఆ పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు రాంబాబు.

"ఇప్పుడెలా ఉందండి? నీరసంగా ఉందా? మాత్రలు వేసుకుంటున్నారా?" అంటూ అరిగిపోయిన ప్రశ్నలతో ఇంటి ఓనరు కుశలాన్ని తెలుసుకుంటున్నాడు రాంబాబు.

ఇంతలో ఫెడీల్మని పిడుగుపాటు.

"ఒసే దున్నపోతు ముండా! జ్యూసు తాగి గంటయ్యిందే. ఈ గ్లాసెక్కడ పెట్టాలే దేబ్యం మొహమా!" రంగమ్మ అరుపు.

రాంబాబు ఎగ్గిరిపడ్డాడు. కుమారి సైలెంట్‌గా వచ్చి ఖాళీ గ్లాసు తీసుకెళ్ళింది. కొద్దిసేపు నిశ్శబ్దం. రాంబాబు రంగమ్మని అంత దగ్గర్నుండి ఎప్పుడూ చూళ్ళేదు. అతనికి ఇబ్బందిగా ఉంది. రంగమ్మ రాంబాబుని పరీక్షగా చూసింది. కొంతసేపటికి తన కష్టాలు రాంబాబుతో చెప్పకోవడం మొదలెట్టింది.

"అందరికీ నా గొంతు వినిపిస్తుంటుంది. కానీ నేనీ దొంగముండతో ఎంత కష్టాలు పడుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ఒక్కపనీ సక్రమంగా చేసి చావదు. నాతో ఊరికే అరిపిస్తుంటుంది. నువ్వు చెప్పు బాబు! ఈ ముండని అరవటం నాకేమన్నా సరదానా? పని తెలీని సోంబేరి మొహాన్ని తీసుకొచ్చి నా మొహాన కొట్టాడు." అంటూ మొగుణ్ణి కొరకొర చూసింది రంగమ్మ.

రాంబాబుకి ఆవిడ ధోరణికి భయమేసింది. ఏదో గొణిగి పరుగుపరుగున ఇంట్లోకొచ్చి పడ్డాడు.

ఇల్లు సౌకర్యంగా ఉంది. కానీ రంగమ్మ దెబ్బకి రాంబాబు డీలా పడిపొయ్యాడు. తనకేమాత్రం సంబంధం లేని విషయంలో భర్త అంతలా ఇబ్బంది పడిపోతుండటం ఇందిరకి ఆశ్చర్యంగా అనిపించేది, జాలిగా కూడా అనిపించేది. అందుకే అతన్ని ఓదార్చడానికి అప్పుడప్పుడూ ఏవో నాలుగు మంచి మాటలు చెప్పేది.

"ఆ అమ్మాయీ ఏంతక్కువైందేమీ కాదు. ముంగిలా ఉండి సాధిస్తుంటుంది." అని ఒకసారీ -

"రంగమ్మగారు ఊరికే అలా అరుస్తుంది గానీ - ఆవిడది చాలా మంచి హృదయం. మొన్న మన బాచీగాడు ఆడుకుంటుంటే పిలిచి మరీ అరిశలు పెట్టారు." అని ఇంకోసారీ చెబుతుంటుంది.

కానీ రాంబాబు ఇందిర మాటలు నమ్మలేదు. ఆ కబుర్లన్నీ తన ఇబ్బంది తగ్గించడానికి ఇందిర చేస్తున్న బేలన్సింగ్ యాక్ట్‌గా అర్ధం చేసుకున్నాడు. క్రమేపి రాంబాబు మధ్యాహ్నం పూట ఇంటికి రావడం తగ్గించాడు. బ్యాంకులో ఏదో పనుందని ఇందిరకి చెప్పడం మొదలెట్టాడు. ఈ విషయంలో రాంబాబుకీ, ఇందిరకీ గొడవలు కూడా మొదలయ్యాయి.

ఆ రోజు ఆదివారం. కింద ఇంటికి ఉదయం నుండీ వచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు. కొంతసేపటికి ఆటోలో కొందరు రైతు కూలీలు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఆదివారం కావున అప్పటికి ఫిల్టర్ కాఫీ మూడోసారి తాగి, హిందూ పేపర్ చదువుతూ, అంతర్జాతీయ రాజకీయల పట్ల రాంబాబు తీవ్రంగా కలత చెందుచూ మధనపడుచుండగా - ఇందిర హడావుడిగా వచ్చింది.

"రాంబాబు! కుమారి ఆ ఎదురు ఇస్త్రీ పెట్టె బండివాడితో లేచిపోయింది. రంగమ్మగారి బంగారు గొలుసు, ఇరవై వేల రూపాయలు క్యాష్ కూడా కనబడట్లేదుట! ఇన్నాళ్ళూ నంగిలా, ముంగిలా కనబడుతూ భలే నమ్మించింది. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్ధమయి చావట్లేదమ్మా!" అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబుకి ఇందిర చెప్పేది అర్ధం కావటానికి రెండు క్షణాలు పట్టింది. క్రమంగా మనసంతా ఆనందంతో నిండిపోయింది. తనకి బ్యాంక్ ఉద్యోగం వచ్చినప్పుడు కూడా రాంబాబుకి అంత ఆనందం కలగలేదు.

హడావుడిగా లుంగీ నుండి ప్యాంటు, షర్టులోకి మారిపోయి కింద పోర్షన్లోకి వెళ్ళాడు. అక్కడంతా కోలాహలంగా ఉంది. గుమ్మానికివతల దిగాలుగా, తప్పు  చేసినవాళ్ళలా ఒక నడివయసు జంట నేల మీద కూర్చునుంది. బహుశా కుమారి తలిదండ్రులయ్యుంటారు.

రంగమ్మ హాలు మధ్యలో పడక్కుర్చీలో పడుకుని శోకాలు పెడుతుంది. చుట్టూతా చేరిన ఆడంగులు ఆవిడని ఓదారుస్తున్నారు.

"కన్నకూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా. ఏనాడూ ఏదీ తక్కువ చెయ్యలేదమ్మా. రోజుకి నాలుగుసార్లు నాలుగు కంచాలు తినేదమ్మా. చివరకి నా కొంపకే ఎసరు పెట్టిందమ్మా. జెర్రిపోతులాంటి గొలుసమ్మా! నా పుట్టింటి బంగారమమ్మా!" అంటూ చప్పట్లు కొడుతూ నుదురు కొట్టుకుంటూ రంగమ్మ ఏడుస్తుంది.

"పిన్నిగారు! కొంచెం ఎంగిలి పడండి. పొద్దున్నుండి పచ్చిమంచినీళ్ళయినా ముట్టలేదు. అసలే మీరు బీపీ పేషంటు." అంటూ ఎదురింటి శాస్త్రి భార్య రంగమ్మని బ్రతిమాలుతుంది.

అక్కడి వాతావరణం ఎవరో మనిషి చచ్చినట్లుంది. ఇంటి ఓనర్ పెరట్లో మామిడి చెట్టు కింద కుర్చీలో కూర్చునున్నాడు. ఆయన పక్కన కుర్చీ ఖాళాగా ఉంది. రాంబాబు ఆ కుర్చీలో కూలబడ్డాడు.

ఆయన ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయున్నాడు. కొద్దిసేపటికి గొణుగుతున్నట్లుగా అన్నాడు.

"పొద్దస్తమానం కాల్చుకు తింటుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు?"

రాంబాబు ఆశ్చర్యపోయాడు. నమ్మలేనట్లు ఆయన వైపు చూశాడు.

ఆయన నెమ్మదిగా నవ్వాడు. "నాకు తెలుసు మీరు ఇబ్బంది పడుతున్నారని. కానీ నే చెయ్యగలిగింది ఏముంది చెప్పండి? నే కలగజేసుకుంటే ఇంకా రెచ్చిపోతుంది. ఈ దొంగతనం వల్ల డబ్బు పరంగా నాకే నష్టమూ లేదు. ఆ అమ్మాయికి పెళ్ళి బాధ్యత నాదేనని మా పాలేరుకి మాటిచ్చి పన్లో పెట్టుకున్నాను. ఇప్పుడా బాధ్యత తప్పింది. మళ్ళీ ఇంకో మనిషి కోసం వేట మొదలెట్టాలి. మీకు కొన్నాళ్ళు రిలీఫ్." అన్నాడు.

రాంబాబు అక్కడ ఇంకొద్దిసేపు కూర్చుని, ఆయనతో యాంత్రికంగా నాలుగు సానుభూతి వచనాలు పలికి, ఇంటి దారి  పట్టాడు. హాల్లో రంగమ్మ శోకాలు నాన్ స్టాప్‌గా పెడుతూనే ఉంది. ఇప్పుడు ఇందిర కూడా అవిడని ఓదార్చే పటాలంలో చేరింది.

నిదానంగా, హుందాగా మేడ మెట్లెక్కాడు రాంబాబు, ఇంట్లోకి అడుగు పెట్టాడు, తలుపు దగ్గరకేశాడు. ఒక క్షణం ఆగాడు.

"యాహూ! జజ్జనకర జనారే! జనకజనా జనారే! జజ్జనకర జజ్జనకర.. " పెద్దగా అరుస్తూ, ఆనందంతో వికటాట్ఠాసం చేస్తూ - కోయ నృత్యం చెయ్యసాగాడు రాంబాబు. కొద్దిసేపటికి ఆయాసం వచ్చింది. రొప్పుతూ ఫ్రిడ్జ్ లోంచి ఐస్ వాటర్ బాటిల్ ఎత్తి గటగటా తాగేశాడు.

సోఫాలో కూర్చున్నాడు. ఆనందం తన్నుకొస్తుంది. మళ్ళీ పాటందుకున్నాడు.

"భలే మంచి రోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటి రోజు.. "

"ఏదో అనుకున్నాను. నువ్వు పాటలు బాగానే పాడతావే!" అంటూ నవ్వుతూ వచ్చింది ఇందిర.

"ఓ మై డియర్ ఇందూ డార్లింగ్! ఐ లవ్ యూ! సాయంకాలం సినిమా కెళుతున్నాం. బీ రెడీ!" హుషారుగా అన్నాడు రాంబాబు.

ఇందిరా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. ఆమెకి తెలుసు - రాంబాబు ఎందుకంత సంతోషంగా ఉన్నాడో!

(picture courtesy : Google)

56 comments:

  1. ఈ రంగమ్మ గారి వాటాలో మేమూ ఉన్నామండీ. కుమారి కూడా పరిచయమే.

    ReplyDelete
    Replies
    1. రంగమ్మని ఓదార్చిన గుంపులో మీరూ ఉన్నారా?!

      Delete
    2. లేదండీ...ఇంటి ఓనర్ పక్క కుర్చీలో కూర్చుని వున్నాను.

      Delete
  2. పాపం రంగమ్మగారు :))

    ReplyDelete
    Replies
    1. పాపం రంగమ్మగారి మొగుడుగారు (కూడా)!

      Delete
  3. అసలు ఇలాంటి రంగమ్మ లను పనిమనుషులు సులువుగా సాధించవచ్చు. రోజూ దరిద్రంగా వండి పెడితే దెబ్బకి తినలేక చచ్చి ఊరుకుంటారు

    ReplyDelete
    Replies
    1. ఏదో సరదాగా రాసేశాను. ఇది చాలా సీరియస్ సబ్జక్ట్. ఇదే పేరుపై కొడవటిగంటి కుటుంబరావు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి అద్భుతమైన కథలు రాశారు.

      Delete
  4. ఈ రంగమ్మ గుండమ్మ లా ఉందే!

    టపాకి రంగమ్మ కథ అని పెట్టాల్సింది, గుండమ్మ కథలా.

    ReplyDelete
    Replies
    1. అవును. మంచి సలహా. ఈ కథకి 'రంగమ్మ కథ' పేరే బెటర్. ఇప్పుడే మార్చేస్తున్నాను. థాంక్యూ!

      Delete
  5. మీకు కధలు రాయడం అంతగా రాదు. మీ వి'శ్లేష'ణలు మాత్రం చాలా చాలా చాలా బాగుంటాయి.
    కాముధ

    ReplyDelete
  6. DOCYOR GARU,

    BAAGUNDI SIR


    G RAMESH BABU
    GUNTUR

    ReplyDelete
  7. ఓనర్లు చెడ్డవాళ్ళు, పనివాళ్ళు బుద్దిమంతులు మరియు అమాయకులు అనిపించే "ఏడుపుగొట్టు" కథ!
    మీ నుంచి మరీ ఇంత చెత్త కథ ఆశించలేదు డాట్రారు :)

    ReplyDelete
    Replies
    1. కథ మరీ అంత చెత్తగా ఉందంటారా! ఈ కథ రాంబాబు POV తో రాశాను. నాకు ఈ కథలో పాత్రలందరూ తెలుసు.

      మీకున్న అభ్యంతరం కథలో ఓనర్లు, పనివాళ్ళని బ్లాక్ అండ్ వైట్ లో స్టీరియోటైప్ చేశానని. నిజమే కావచ్చు.

      పనిమనుషుల పట్ల క్రూరత్వం మనసుకి సంబంధించిన వ్యవహారం. రంగమ్మ ప్రవర్తనని రాంబాబు తట్టుకోలేకపొయ్యాడు. ఇందిరది వాస్తవిక దృక్పధం. రాంబాబు, రంగమ్మలని చక్కగా అర్ధం చేసుకుంది. అందుకే ఆవిడ హాయిగా ఉంది.

      Delete
    2. మీ కథ లో మొదటి వ్యాక్యం చదివితే కథ మొత్తం తెలిసిపొయింది. తరువాత మరి చదవనవసరం లేదు. కథ రాసే పద్దతి ఇది కాదు.

      Delete
    3. kamudha గారు,

      అవును. ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం.

      Delete
  8. కధలో అచ్చ తెలుగు పదాలు, సన్నివేశాలు అలా వచ్చి ఇమిడిపోయాయి.

    అన్నింటికన్నా హైలెట్ :
    -----------------------------------
    "కన్నకూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా. ఏనాడూ ఏదీ తక్కువ చెయ్యలేదమ్మా. రోజుకి నాలుగు సార్లు నాలుగు కంచాలు తినేదమ్మా. చివరకి నా కొంపకే ఎసరు పెట్టిందమ్మా. జెర్రిపోతులాంటి గొలుసమ్మా! నా పుట్టింటి బంగారమమ్మా!" అంటూ చప్పట్లు కొడుతూ.. నుదురు కొట్టుకుంటూ రంగమ్మ ఏడుస్తుంది."
    ---------------------------------

    రంగమ్మ కనులముందు ఇలా కనిపిస్తుంటే నవ్వాగలేదు. బహుసా ఇదే సంతోషం మీరు కధానాయకుడి హుషారులో చూపించినట్లు ఉన్నారు. మల్లి మల్లి చదివేలా చాల బాగుంది. అది సరే , ఇంతకుముందు కృష్ణప్రియ గారు వ్రాసారు.. ఆఫీస్ లో పనివాళ్ళతో ఉన్నంత చనువు గా ఇంట్లో పనివాళ్ళతో ఉండడం గురించి. సరస్వతి అనుకుంటాను ఆమె పేరు,ఆవిడ పనివాళ్ళకు ఒక అంబేద్కర్, ఒక యరమణ :)

    ReplyDelete
    Replies
    1. Mauli గారు,

      ఆడ పనివారితో ఇంట్లో మగవారు ఫ్రెండ్లీగా మెలగడం మన సమాజంలో కుదరదు. వారికి సపోర్ట్ గా 'పోన్లే పాపం!' అన్నా కూడా రంగమ్మలతో ప్రమాదమే. కుటుంబరావు 'పనిమనిషి' కథలో ఈ కోణం రాస్తాడు.

      Delete
    2. శంఖంలో పోసింది తీర్థం అన్నట్లు, మీకు కొ కు రాస్తే గాని విషయం అర్థం కాదన్నమాట. ఎవరి పని వారు చేసుకోకుండా , కమ్యునిస్ట్ లు పనిమనిషి ద్వారా సేవలు చేయించుకోవటమేమిటి? :) కొ కు తరం అంతరించి చాలా కాలమైంది. ఇంకా ఆయనని గుర్తుంచుకొని ఆ కథలు నెమరేసుకొంట్టు బ్లాగులు రాస్తున్నారంటే , మీకు సాంప్రదాయ వాదులకు పెద్ద తేడా ఎమీ లేదు :)

      Delete
    3. "కొకు తరం అంతరించి చాలా కాలమైంది!"

      నాకు కొకు రచనలు చదవడం చాలా ఇష్టమైన వ్యాపకం. నా జీవితంలో కొకుని చదవని ఎడల ఇప్పుడు నాకు అర్ధమైన చాలా విషయాలు తెలిసేవి కావు. తెలుగు సాహితీలోకంలో కొడవటిగంటి ఒక విశిష్ట రచయిత.

      Delete
    4. చనువు అంటే నా అభిప్రాయం, ఆఫీస్ లో మన బాస్ ను, సబార్డినేట్ ని ఒకేలా పిలుస్తాము, మాట్లాడుతాము. ఇంటిపని చేసే 'సరస్వతి' అలానే ఇంటి వాళ్ళతో ఉంటుంది.
      పని బాగా చేస్తుందని జనం పెట్టుకున్నారు కాని, లేకపోతె పొగరు అని వదిలేద్దురు.

      ఆడవాళ్ళు చనువుగా ఉండనపుడు మగవాళ్ళు మవునంగా ఉండడం ఉత్తమం :)
      మన సమాజం ది మాత్రమె పొరపాటు కాదు ఇక్కడ :)

      Delete
  9. రంగమ్మ గారికి మెంటల్ ప్రాబ్లం ఉందని నా అనుమానం. వయస్సు పెరిగిన కొద్దీ ఇటువంటివి వస్తాయని అంటారు. ఒక విధంగా రంగమ్మ గారి భర్త పనిమనిషి మూలాన బతికి పోయారు. లేకపోతే మాటలన్నీ తను భరించాల్సి వచ్చేది.

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju గారు,

      రంగమ్మది ఫ్యూడల్ మనస్తత్వం. అహంకార ధోరణి. సామాజికంగా, ఆర్ధికంగా తనకన్నా తక్కువ స్థాయి కలవారిని నీచంగా చూస్తుంది. అందుకే రాంబాబుకి రంగమ్మంటే అంత ఏవగింపు.

      Delete
    2. అచ్చు తప్పు . రాంబాబు కి రంగమ్మ అంటే అంత ఏవగింపు అనే దానికనా డా|| య. రమణ కి రంగమ్మ అంటే అంత ఏవగింపు అని రాసి ఉండాల్సింది.మీ గుంటూరు, విజయవాడలలో ఆధోరణి మరి ఎక్కువలేండి.

      Delete
    3. @య. రమణ కి రంగమ్మ అంటే అంత ఏవగింపు అని రాసి ఉండాల్సింది.మీ గుంటూరు, విజయవాడలలో ఆధోరణి మరి ఎక్కువలేండి.

      మరే, రాంబాబు ది గుంటూరు, విజయవాడ కాదా ? :)
      మిగిలిన జిల్లాలవారికి రమణమ్మ అంటే మైమరుపా :)

      Delete
  10. మీ రంగమ్మ కథ చాలా బాగుంది రమణ గారు.
    రంగమ్మ లాంటి వాళ్ళు మన చుట్టూ పక్కల బోలెడంతమంది కనిపిస్తారు.ఒక ఫన్ని థింగ్ ఏంటంటే..
    మా ఇంటి పక్కన ఒకావిడ రోజు భగవద్గీత చదివేది.చాల సైలెంట్ గా ఉండేది. మంచిగా పలకరించేది అందరిని. ఆవిడ తన కొడుక్కి పెళ్లి చేయడానికి చాల తిప్పలు పడింది, ఎందుకంటే ఆవిడక గయ్యాళి అన్న పేరు ఉంది మా ఊళ్ళో, దాంతో ఎవరు ఆ ఇంటికి పిల్లనివ్వడానికి రాలేదు. అంతే కాదు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఆరు నెలలు కన్నా ఎక్కువ అద్దెకి ఉండేవాళ్ళు కాదు. గయ్యాళి అంటే ఎప్పుడు అరుస్తా ఉంటారేమో అని అనుకునేవాన్ని, ఆవిడ ని చూసాక నా అభిప్రాయం తప్పని తెలిసింది. ఇంకా ఫన్ని ఏంటంటే ఆవిడ చదివే భగవద్గీత వినడానికి, రెండు వీథుల్లో ఉండే ఆడవాళ్ళు అంత వచ్చేవాళ్ళు.
    ఈ రంగమ్మ కథ లో, పని మనిషి అయిన , కూతురు అయిన అదే పని చేసేదేమో..
    :venkat

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు,

      దైవభక్తికి aggression తగ్గించగలిగే శక్తి లేదేమో!

      నిన్న మా ఇంటి పక్క మామ్మగారు పూజకి కుళ్ళిన కొబ్బరికాయ తెచ్చాడని వాళ్ళాయన్ని గంటసేపు తిట్టింది!

      Delete

    2. నిన్న మా ఇంటి పక్క మామ్మగారు పూజకి కుళ్ళిన కొబ్బరికాయ తెచ్చాడని వాళ్ళాయన్ని గంటసేపు తిట్టింది! అంటే,.........
      భక్తులు ప్రతి విషయానికి తమకు తోచినట్లు అర్ధాలు చెప్పుకుని బాధపడటం అనేది భక్తుల తప్పు. అంతేకానీ, దైవభక్తికి శక్తి లేకపోవటం కారణం కాదండి.

      జీవితంలో సత్కర్మలను ఆచరిస్తూ , ధ్యానం లేక నామజపం చేయటం వల్ల దైవభక్తి యొక్క శక్తి మనిషిలో పెరుగుతుంది. ధ్యానం లేక నామజపం చేయటం పెరిగిన కొద్దీ, మనిషిలోని కోపం... వంటి బలహీనతలు తగ్గుతూ వస్తాయి.

      వైద్యులు రోగులకు రోగం తగ్గేవరకు వాడమని ఒక కోర్స్ మందులు ఇస్తారు. రోగి ఒక రోజు మందులు వేసుకోగానే వ్యాధి తగ్గిపోదు కదండి. ఒక రోజుకే రోగం తగ్గలేదు కాబట్టి వైద్య శాస్త్రానికి జబ్బులను తగ్గించే శక్తి లేదు అనలేము కదా ! రోగి రోగం తగ్గేవరకూ మందులు వాడవలసే ఉంటుంది.

      Delete
    3. anrd గారు,

      దైవభక్తి, నామజపం వంటి విషయాల్లో నేను పూర్తిగా అజ్ఞానిని. మీ అభిప్రాయాల్ని పూర్తిగా ఒప్పుకుంటున్నాను.

      >>ధ్యానం లేక నామజపం చేయటం పెరిగిన కొద్దీ, మనిషిలోని కోపం... వంటి బలహీనతలు తగ్గుతూ వస్తాయి.<<

      అప్పుడు మేమేం చెయ్యాలి? ఆకలి చావులు చావాలా? సారీ! వృత్తిద్రోహం చెయ్యలేను! ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

      "ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే మీ కోపాన్ని పోగొట్టగలడు!" అని నొక్కి వక్కాణిస్తున్నాను.

      Delete
    4. సర్ ! మీరు ఎందుకో నన్ను అపార్ధం చేసుకున్నారు.

      ఫరవాలేదండి. పడ్ద వాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదంటారు పెద్దలు.

      Delete
    5. anrd గారు,

      తెలుగు సినిమా పాత్రల్లా మనిద్దరం ఒకళ్ళనొకళ్ళం సీరియల్ గా ఆపార్ధం చేసుకుంటున్నాం. నా కామెంట్ సీరియస్ గా రాసింది కాదు. నవ్వుకుంటూ సరదాగా హ్యూమర్ కోసం రాసిన జోక్ మాత్రమే! దయచేసి ఇంకొక్కసారి చదువుకోగలరు.

      Delete
    6. She is humor impaired. If you read her incoherent blog, you will understand.
      Look at her nonsensical analogy here.

      Delete

    7. రమణ గారు , నేను మీ బ్లాగును చదువుతాను. మీరు వ్రాసిన కొన్ని టపాలు చాలా బాగున్నాయండి.
      ..................................
      అనానిమస్ గారు, నా బ్లాగును చదువుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇతరుల బ్లాగులో కొచ్చి నేను మీకు కృతజ్ఞతలు చెప్పవలసి రావటం చాలా చిత్రంగా అనిపిస్తోంది.
      ఎవరికైనా జీవితంలో హాస్యం అవసరమే. అలాగే నాకు కూడా హాస్యం అంటే చాలా ఇష్టం. నేను జోక్స్ చక్కగా వేస్తానని కూడా కొందరు అంటుంటారు.
      నేను ఎప్పటినుంచో నా బ్లాగులో ఒక జోక్ రాద్దామనుకుని రాయలేకపోయాను. బ్లాగుల్లో అపార్ధాలు చేసుకోవటం ఎక్కువగా ఉంది. మనమేం వ్రాసినా కొందరు అపార్ధం చేసుకుంటున్నారు. ఆ భయంతో ఆ జోక్ ను ఇంతవరకు రాయలేదు.
      ఆ జోక్ ను ఇక్కడ వ్రాస్తున్నందుకు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతా దైవం దయ. .........
      మా మ్యూజిక్ టీచర్ గారు చెప్పిన ఆ జోక్ ఏమిటంటే, ..................
      ఒక హాస్పిటల్ లో , ఒక పేషెంట్ ను పరీక్షించి , అతను చనిపోయాడని నిర్ధారించి , డాక్టర్ వెళ్ళిపోయాడు.
      భార్య మరియు బంధువులందరూ గొల్లుమని ఏడుస్తున్నారు.
      ఇంతలో నెమ్మదిగా కదిలిన ఆ పేషంట్ , తన ప్రక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్యను నెమ్మదిగా చేత్తో తట్టి ...
      నేను బతికే ఉన్నాను .... అన్నాడు.
      భర్తను చూసిన ఆ భార్య ఏమన్నదంటే......
      ఊరుకోండి, డాక్టర్ కన్నా మీకెక్కువ తెలుసా ........అన్నది.
      ............................
      నేను ఏమనుకున్నానంటే,
      బహుశా , డాక్టర్ సరిగ్గా పరీక్షించలేదేమో .....అని .
      లేక
      బహుశా, దైవం దయ వల్ల అతను తిరిగి బ్రతికి ఉండొచ్చు....... అని .
      * వ్యాఖ్యను టపాలా రాసి చాలా స్థలాన్ని వాడుకున్నందుకు రమణ గారికి క్షమాపణలు.

      Delete
    8. :)) anrd గారు, మీరు రాసిన జోక్ బాగుందండి. బ్లాగులో రాసుకోవడానికి ఎందుకు సందేహించారు?!

      అపార్థం ఏమీలేదు, వారంతే. రాక్షసులకు దేవతలకూ బద్ధ వైరమన్నది తెలిసిందేగా. కలియుగం, వాళ్ళదే మెజారిటీ. :)

      Delete
    9. SNKR గారు,
      ఈ జోక్ ను మొదట ఎవరు సృష్టించారో కానీ, చక్కటి జోక్.

      Delete
    10. anrd గారు,

      నా టపాలు చదువుతున్నందుకు ధన్యవాదాలు.

      జోక్ బాగుంది. నేనయితే దైవదయ వల్లనే అతను బ్రతికాడని అనుకుంటున్నాను!

      మీరు నా బ్లాగులో వ్యాఖ్య రాసేప్పుడు భాషలో మరీ అంత మర్యాదలు పాటించనవసరం లేదు. సరదాగా రాసెయ్యండి.

      Delete
    11. anrd గారూ జోక్ బాగుంది. టెంపో బిల్డ్ అప్ చేస్తూ వ్రాయటం ఇంకా బాగుంది.
      SNKR గారి రిప్లై ఇంకా ఇంకా బాగుంది.

      Delete
    12. yaramana గారు కృతజ్ఞతలు.

      Rao S Lakkaraju గారు కృతజ్ఞతలు.

      ఇంకా జోక్ నచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను.

      Delete
    13. @anrd

      yaramana గారుమీతో వేసిన జోకులు అన్నీ నచ్చాయా ???
      మాకు బాగా నచ్చాయి

      Delete
    14. Rao gaaru. :)
      ---
      Anonymous11 October 2012 23:36
      అజ్ఞాతా... మీ జబ్బు నయమయ్యి, మన డాక్టర్ గారి బిల్ చూశాక కూడా ఇదే మాటమీద వుండాలి, నచ్చింది అనాలి, సరేనా? ;) :D

      Delete
  11. ఇలాంటి కథ పాత సినిమాలో ఏక్కడొ చూసినట్టు గుర్తు. రేలంగి/ఎస్వీ రంగారావు -సూర్యకాంతం.
    SNKR

    ReplyDelete
    Replies
    1. నాకయితే గుర్తు లేదు. రంగమ్మని చదువుతుంటే సూర్యాకాంతం గుర్తు రావడం సహజం. దటీజ్ సూర్యాకాంతం!

      Delete
  12. Good entertaining story. This one reminds me of your other post on psycho analysis of gundamma. Just replace gundamma with rangamma in that story. ;)

    ReplyDelete
    Replies
    1. Gundamma is close to my heart. She has different shades in her personality, a delight to any psychologist to analyse. We don't know much about Rangamma except her sadistic pleasure in shouting at her servant maid.

      Delete
  13. ఇది మీ "స్టైల్" కాదు మహాశయా !!!
    ఇది కొంచం కృత్రిమంగా అనిపించింది .
    మీరు సమకాలిన రాజకీయ, సాంఘిక పరిస్థితుల గురించి, మీ స్టైల్ లో చాల బాగా వ్రాయగలరు, example సుబ్బు, మీ corporate కాలేజీ items etc .

    just my opinion...

    ReplyDelete
    Replies
    1. స్టైల్ దేముందిలేండి! బుర్రలోకొచ్చిన ఆలోచనల్ని రాసి పడేస్తున్నాను. మీకు కొన్ని నచ్చుతున్నయ్. థాంక్యూ!

      Delete
  14. నేను కధలు పెద్ద గా చదవలేదు....నాకు మాత్రం నచ్చింది....మన మనసుని రిఫ్లెక్ట్ చేసింది అనిపించింది...
    90% రాంబాబులున్నారేమొ సమాజంలో... రంగమ్మలకి కొదవలేదు లెండి..పని మనుష్యులననే కాదు... మొగుళ్లనే పీక్కు తినేస్తారు...ఓం..శాంతి..

    ReplyDelete
  15. ఒరై రమన ,
    అద్రింది ర నె పనిమనిష్ కద. ఫంథస్తిచ్ స్చ్క్రిప్త్ కీప్ ఇత్ ఉప్
    పార్ధు

    ReplyDelete
  16. Ramana gaaru, ee madhya news chusthonte vallu mandi pothundi.... vadra gaaremo "quid pro co " chesaarani kejriwal mothukuntonte, eppudu congress, sonia ni thitte chandra babu gaaru kaani, YSRCP jagan, vasireddy padma or vijayamma lu kaani emi comment cheyatledu. jagan chesinadaaniki vadra chesinadaaniki enti thedaa no naaku artham kaaledu, anni oka takkedaloni kappale anipisthondi.. mee subbu gaarini adagandi, emantaaroooo.....

    ReplyDelete
    Replies
    1. మీకో ఉచిత సలహా. తెలుగు పత్రికలు, మేగజైన్లు, బ్లాగులు చదవకండి. తెలుగు చానెళ్ళు చూడకండి. మానసికంగా హాయిగా ఉంటారు.

      ఈ దేశం కోసం త్యాగాలు (?) చేసిన గాంధీ కుటుంబం మీద అపవాదాలా! ఇది చాలా అన్యాయం.

      Delete
    2. రమణగారు,

      ఈరోజు ఈ దేశం కోసం త్యాగాలు చేసిన వారి సినేమా దానిపేరు చిట్టగాంగ్ అనే హింది సినేమా చూశాను. చాలా బాగుంది. మీకు వీలైతే డివిడి లో చూడండి.

      Based on real life characters and events, ‘Chittagong’ directed by NASA scientist and debutant filmmaker Bedabrata Pain is one specimen of patriotism personified piece of art woven intricately by fine nuances of film-making.

      Chittagong is the only place in India where all youth under 18 has participated in Revolution against British Emperor.

      http://zeenews.india.com/entertainment/movies/chittagong-movie-review-gear-up-for-a-rendezvous-with-your-patriotic-side_120914.htm

      http://www.youtube.com/watch?v=4VXorVCFOBU


      Regds
      SriRam

      Delete
    3. శ్రీరాం గారు,

      మీరు ఇచ్చిన లింక్స్ చూశాను. తప్పకుండా ఈ సినిమా డివిడి చూస్తాను. థాంక్యూ!

      Delete
  17. nijanga jariginanduku santhosham

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.