Saturday 28 April 2012

hmtv వందేళ్ళకథకు వందనాలు.. గొప్ప కామెడీ షో!


"మిత్రమా! ఇవ్వాళ రాత్రి hmtv చూడు. రావిశాస్త్రి గూర్చి ఏదో ప్రోగ్రాం వస్తుందిట." అని నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. నాకు టీవీ చూసే అలవాటు పెద్దగా లేదు. అందులోనూ తెలుగు న్యూస్ చానెళ్ళు అంటే నాకు భయం! కానీ hmtv కె.రామచంద్రమూర్తి సారధ్యంలో నడుస్తున్న చానెల్. ప్రోగ్రాం బాగుండే అవకాశం ఉంది. కావున రావిశాస్త్రి కార్యక్రమం చూద్దామని నిర్ణయించుకున్నాను.

ప్రోగ్రాం పేరు 'వందేళ్ళకథకు వందనాలు'. సాహిత్య సంచికా కార్యక్రమం. సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు. ప్రోగ్రాం మొదలైంది. గొల్లపూడి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన సినిమాల్లో వాగుడుకాయ పాత్రలు వేశాడు. బయటకూడా ఇంతే అని అర్ధమైపోయింది.

ఇంతకీ ఈ ప్రోగ్రాం target viewers ఎవరు? 1.ఆయాకథలు ఆల్రెడీ చదివేసి.. చదివిన కథల్ని టీవీలో చూసుకుని కొత్త అనుభూతి పొందేవారా? 2.సమీప భవిష్యత్తులో ఆయారచయితల కథలు చదువుదాం అనుకునేవాళ్ళా? 3.క్రైం వార్తలు, సీరియళ్ళు చూస్తూ పొరబాటున రిమోట్ నొక్కి hmtv లోకి వచ్చేవాళ్ళా? ఎవరికోసమైనా, ఏరకంగా చూసుకున్నా ఒక 'దశ-దిశ' లేని ప్రోగ్రాం ఈ వందేళ్ళకథలు.

పాతపాటల్ని remix చేస్తున్నట్లుగా ఈమధ్య పాతకథల్ని remix చేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఖదీర్ బాబు చేతిలో 'సాక్షి' ఉంది కాబట్టి, పాతకథల్ని ఆయన శైలిలో రాసేసుకుంటూ పొయ్యాడు. ఆతను 'ఒక గొప్ప సాహిత్య ప్రయోగం చేశాను. మూలబడ్డ పురాతన కథలకి వెలుగునిచ్చాను.' అని అనుకోవచ్చు. మంచిది.

అయితే ఖదీర్ బాబు ఈ కథల్ని ఎవరికోసం రాశాడు? తెలుగుకథ మహా అయితే ఐదారు పేజీలుంటుంది. చదవటానికి ఎక్కువసేపు పట్టదు. ఆ ఓపిక కూడా లేనివాడికి ఒక నమస్కారం. ఎవరూకూడా తెలుగుకథని చదివి ఉద్ధరించనవసరంలేదు. (మంచి కథలు మనని గ్యారెంటీగా ఉద్ధరిస్తాయి. మనం కథల్ని ఉద్ధరించలేం!)

ఈ స్పీడుయుగంలో అందరూ అన్నీ cash చేసుకుంటారు. అందుకే కథల్ని చదివే ఆసక్తి, ఓపికా లేని మారాజుల కోసం (డబ్బు దండిగా సంపాదించి కథ వైపు తొంగిచూద్దాం అనుకునేవారి కోసం) fast food లాగా, twenty over cricket match లాగా ఖదీర్ బాబు రాసేశాడు.

నాకయితే ఖదీర్ బాబు కథనరీతి మిమిక్రీలాగా, ఏకపాత్రాభినయంలాగా అనిపించింది. సరే! ఎందఱో ఈ ప్రక్రియని విమర్శించారు. కొందరు మెచ్చుకున్నారు. ఖదీర్ బాబు చివరికి బీనాదేవి సర్టిఫికేట్ తో బయటపడ్డాడు. అతనికి ఆ మాత్రం తలంటు పొయ్యకపొతే చలాన్ని, కుటుంబరావుల్ని కూడా తిరగరాసే ప్రయత్నం చేసేవాడేమో!

పుస్తకాల్ని చదవలేని సోమరుల కోసం సంక్షిప్తం చేసే ప్రక్రియ ఇప్పటిది కాదు. కన్యాశుల్కాన్ని నార్ల వెంకటేశ్వరరావు abridge చేశాడు. మన చిన్నప్పుడు text book కి గైడ్ ఉండేది! అలాగన్నమాట. ఈ గైడ్ వల్ల నార్ల సాధించింది ఏమిటో తెలీదు. సరే! ఆయన కలం, ఆయన కాగితం, ఆయన పబ్లిషర్. మనకి అనవసరం. 

మళ్ళీ మన hmtv వందేళ్ళకథకి వద్దాం. తెలుగుసాహిత్యంలో గొల్లపూడి మారుతీరావు స్థానం, స్థాయి ఏమిటో నాకు తెలీదు. తెలీకపోవడం అనేది నా తప్పవుతుందిగానీ గొల్లపూడిది కాదు. నా అజ్ఞానాన్ని మన్నించండి. బహుశా సినిమానటుడు కూడా కావున ప్రోగ్రాంకి ప్రాచుర్యం వస్తుందని అతన్ని ఎంచుకునిఉండొచ్చు.

సెట్ చూస్తే చాలా చౌకగా ఉంది. వందేళ్ళతెలుగు కథేమోగాని.. సెట్ మాత్రం వందేళ్ళక్రితం వేసినట్లు ఉంది. black and white దూరదర్శన్ సెట్లు గుర్తొస్తాయి. ఒక టీపాయ్, రెండు కుర్చీలు. అంతే!

ఈ వందేళ్ళకథకి ఒక editorial policy ఉన్నట్లుంది. ఈ ఇరుకు సెట్లో రచయితకి ఒకకుర్చీ. సదరు రచయిత మరణించిఉంటే ఆకుర్చీలొ రచయిత భార్య, భార్య కూడా పొతే కొడుకు.. మనవడు.. మునిమనవడు. వీళ్ళెవ్వరూ దొరక్కపోతే రచయితగారి పక్కింటాయన! ఈ లెక్కననుసరించి రావిశాస్త్రి లేడు కావున ఆయన కొడుకు గొల్లపూడి ఎదురుకుర్చీలో కూర్చున్నాడు. 

పాపం! ఆ అబ్బాయి గొల్లపూడి వాగ్ధాటికి బెదిరిపోయ్యాడు. గొల్లపూడి తన trademark హావభావాలతో రావిశాస్త్రిని పొగడ్తల దండకంతో ముంచేస్తున్నాడు. అప్పుడప్పుడు రావిశాస్త్రి కొడుకుని మాట్లాడనిస్తున్నాడు. ఆ ప్రశ్నలు కూడా చౌకబారు ప్రశ్నలు. 'నాన్నగారు రాత్రిళ్లు రాస్తారా? పగలా? టేబుల్ మీద రాస్తారా? మంచంమీద రాస్తారా?' ఇవీ ఆ ప్రశ్నలు!

కొంతసేపటికి ఆ అబ్బాయి రావిశాస్త్రి కథ నొకదాన్ని కూడబలుక్కుంటూ చదవసాగాడు. గొల్లపూడి ఆ కుర్రాణ్ణి తన తండ్రి కథని పట్టుమని పదిలైన్లు కూడా చదవనీలేదు. లాక్కుని తనే చదవడం మొదలెట్టాడు. ఒక రాజకీయ నాయకుణ్ణి వందమాగదితులు పోగుడుతున్నట్లు రావిశాస్త్రిని పొగుడుతూనే ఉండటం నిరాటంకంగా కొనసాగింది. నాకు వెగటేసింది. ఇదీ hmtv వాళ్ళ సాహిత్య కార్యక్రమం! 

hmtv ఒక private channel. కావున వాళ్ళు 'ఇది మా ప్రోగ్రాం. మా ఇష్టం. చూస్తే చూడు. లేకపోతే మానెయ్యి' అనొచ్చు. అంటారు కూడా. నేను, నా బ్లాగు, నా ఇష్టం అని మనంకూడా అనుకుంటున్నాంగదా. అయితే నాకు కొన్ని సందేహాలు. ఆస్తిపాస్తులకి వారసత్వం ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి కుర్చీ కూడా వారసత్వమే అంటున్నారు. ఈ సూత్రం తెలుగు సాహిత్యానికి కూడా apply అవుతుందా?

శ్రీశ్రీ, రావిశాస్త్రి, కుటుంబరావులు తెలుగువారి ఆస్థి. పుస్తకాలపై వచ్చే రాయల్టీకి, కుటుంబ సభ్యులకి సంబంధం ఉంటుంది. అంతే! అంతేకాని ఫలానా రచయిత మనవళ్ళని, మునిమనవళ్ళని దుర్భిణీ వేసి వెతికి పట్టుకొచ్చి ఆ రచయితల వ్యక్తిగత అలవాట్లని చర్చించడం సాహిత్య కార్యక్రమం ఎలా అవుతుంది?

Medical science లో ఎన్ని బ్రాంచ్ లు ఉన్నాయో సాహిత్యంలో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. అనేక పీఠాలున్నయ్. పీఠాధిపతులూ ఉన్నారు! వీరికి చాలా స్పష్టమైన విభజన రేఖలున్నయ్. ఒకళ్లంటే ఇంకొకళ్ళకి పడదు. కొన్ని ఉదాహరణలు రాస్తాను. ముళ్ళపూడి గూర్చి శ్రీరమణ అద్భుతంగా చెప్పగలడు. రావిశాస్త్రి గూర్చి చలసాని ప్రసాద్, చలం గూర్చి రంగనాయకమ్మ, శ్రీశ్రీ గూర్చి కె.శివారెడ్డి.. ఇట్లా అనేకరకములైన రచనలకి వేరువేరు స్పెషలిస్టులు ఉన్నారు.. ఉంటారు. విశ్వనాథ సత్యన్నారాయణని కాళీపట్నం రామారావు చేత విశ్లేషించ బూనడం సరికాదు. మా.గోఖలేకి ముదిగొండ శివప్రసాద్ పనికిరాడు. (గుండెపోటుకి చర్మవ్యాధుల వైద్యం పనికిరాదు).

అంచేత తెలుగు కథలకి పరిచయమో, పొగడ్తో.. అన్నింటికీ anchor ఉదయభానులా ఒకళ్ళే ఉండటం సరికాదు. కథకులందర్నీ అదేపనిగా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇంకా నీ గోలేంటి? నిజమే! కథా పరిచయం, విశ్లేషణ ఒక సీరియస్ సాహిత్య ప్రక్రియ. అప్పుడు మనకి రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు, రిఫరెన్సులు  అవసరమవుతాయి. పొగడటానికి ఎవరైతే ఏంటి! ఏ తెలుగు పండితుడైనా.. ఏ సన్మాన పత్రాలు రాసేవాడైనా సరిపోతుంది.

hmtv వారి సాధకబాధలు మనకి తెలీదు. ఖర్చు తగ్గించుకుందామనో, సాహిత్యపు ప్రోగ్రాములకి ఇదిచాల్లే అనుకున్నారో తెలీదు. దూషణ భూషణములన్నీ గొల్లపూడి ఖాతాలోకి పోతాయిలే.. మనకెందుకు అనుకున్నారా? లేదా గొప్ప ప్రోగ్రాం అంటే ఇదే అని ఆనందపడుతున్నారేమో! మంచిది. నాకు మాత్రం ఏదో సినిమా నటుల్ని పొగిడే ప్రొగ్రాంలాగా అనిపించింది. అందుకే ఈ ప్రయత్నం ఒక C-grade TV serial స్థాయిలో  ఉంది.

అయితే.. hmtv వాళ్ళు తెలుగు సాహిత్యం అంటూ కనీసం (ఎంత చెత్త ప్రోగ్రామయినప్పటికీ) ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అందుకు అభినందిస్తున్నాను. హుందాతనంలో మిగిలిన తెలుగు చానెల్స్ తో పోలిస్తే hmtv ఎంతో ముందుంది.  మిగిలిన చానెల్స్ మరీ నాసిగా ఉంటాయి.


కె.రామచంద్రమూర్తి print medium వదిలి టీవీకి వెళ్ళడం వల్ల తెలుగు జర్నలిజానికి నష్టం జరిగిందని భావిస్తున్నాను. ఒకవిషయం గూర్చి అవగాహనతో లోతైన విశ్లేషణ చెయ్యడం, చేయించడం print medium లోనే సాధ్యం. తెలుగు టీవీకి serious journalism అవసరమా? అవసరం లేదనుకుంటున్నాను. సరే! ఇది రామచంద్రమూర్తి career. పూర్తిగా ఆయనిష్టం. మన ఇష్టాయిష్టాలు ఆయనకనవసరం. అడగడానికి మనమెవరం? (నేను hans india పేపర్ చూళ్ళేదు.)

చికాగ్గా నాస్నేహితుడికి ఫోన్ చేసాను. "ఏమి నాయనా! నీకు నామీద ఇంత కోపముందని తెలీదు. ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం చూడమంటావా?" అన్నాను.

ఆతను పెద్దగా నవ్వాడు. "ఆ ప్రోగ్రాం అసలుపేరు  గొల్లపూడి talk show. జనాలు చూడరని గంభీరత కోసం పేరు మార్చారు. నీకు ఆ ప్రోగ్రాం చూసి కోపం వచ్చింది. నాకు మాత్రం నవ్వొస్తుంది. గొల్లపూడి వాక్ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతిధులని చూస్తుంటే భలే కామెడీగా ఉంటుంది నాకు. కాదేది కామెడీకనర్హము!"

"ఆ కామెడీ ఏదో నువ్వే ఎంజాయ్ చెయ్యొచ్చుగా! నా time waste చెయ్యడం దేనికి?"

"హి.. హి.. హి.. నీతో తిట్టించుకోవటం కూడా కామెడీగా ఉంది." అంటూ ఫోన్ disconnect చేశాడు!

(pictures courtesy : Google)

32 comments:

  1. డాక్టర్ గారు,

    పామరుడైన నాలాంటివాడికి మీ బ్లాగులో మంచి సామాజికమయిన మరియు హాస్యబరితమయిన వాటిని చదువుకొని ఆనందించడం అలవాటు.

    మీకు చిత్తూరు నాగయ్య ఎలాగో మీ బ్లాగు మాకు అలా

    కాని ఇవాళ ఎదో అర్దం కాని విషయం చెప్పి మీకు గొల్లపూడి మారుతీరావు బోరు కొట్టించాడు కదా అని మీరు కుడా మమ్మల్ని వదల్లేదు కదా.

    మొత్తం పోస్టులో ఆంద్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వారు అడిగే చౌకబారు ప్రశ్నలు ఇదొక్కటే నాకు నచ్చింది.

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  2. "....అతనికి ఆ మాత్రం తలంటు పొయ్యకపొతే చలాన్ని, కుటుంబరావుల్ని కూడా తిరగ రాసే ప్రయత్నం చేసేవాడేమో...."

    ఎంత ప్రమాదం తప్పిందీ!!!!!

    ReplyDelete
  3. ".......విశ్వనాథ సత్యన్నారాయణని కాళీపట్నం రామారావు చేత విశ్లేషించ బూనడం సరికాదు....."

    బహు బాగా చెప్పితిరి.

    ReplyDelete
  4. hmtv ప్రొగ్రాం తొ పాటు ప్రింట్ మీడియా లో ఉన్న అవలక్షణాలని కడిగి ఉతికి పారేసారు .
    ప్రింట్ మీడియా చేతిలొ ఉంటె.. ఎవరికి తొచింది వారు వ్రాసుకున్నదే గొప్ప రచనలుగా చెలామణీ అయిపోయిన రొజులు ఇవి. పత్రికలలో రచనలు కూడా ప్రాంతీయాన్ని బట్టి అక్షర రూపంలొ పాఠకులకి కనువిందు చేసే తీరుని మీరు ఇంకా గమనించలేదేమో రమణగారు ఒక సారి గమనించండి. .
    మంచి విష్లేషణ తో పొస్త్ వ్రాసారు. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

    ReplyDelete
  5. @ramaad-trendz,

    రమేష్ బాబు గారు,

    సారీ! ఈ ప్రోగ్రాం ఒక్కసారే చూశాను. కానీ మొన్న ఒక పార్టీలో వందేళ్ళ కథ ప్రస్థావన వచ్చింది. నా అభిప్రాయం రాయాలనిపించి రాసేశాను.

    ReplyDelete
  6. శివరామప్రసాదు కప్పగంతు గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  7. వనజావనమాలి గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  8. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  9. Padmarpita గారు,

    thank you.

    ReplyDelete
  10. This programme is an exhibition of Gollapudi's histrionics in the name of of telugu literature.
    I just can't stand his style.
    But i like teh lady anchor's presentation.

    ReplyDelete
  11. డాక్టర్ గారు , బహుశ మీ స్టై ల్ పక్కన పెట్టి రాయడం వలన కొంచెం బొర్ కొట్టించారు, చమత్కారం పాల్ల్లు తగ్గింది. మీ స్ట్యైల్లొ కొచ్చె యండి మాస్టారు.

    ReplyDelete
  12. Ramana gaaru naaa peru Raju, anni posts ekabigina okkaroju chadivesaa meevi baavunnaayi. kaani ee post lo konni ekkuva konni takkuva :)
    Takkuvaina
    Gollapudi vaarini Gollapudi ani sambodhinchadam, mee vayassu entho naaku teleedu kaani Gollapudi gaaru meekanna peddale ani bhaavisthunnaa kaabatti konchem maryaada takkuva chesi vaari meeda meekunna kopaanno/duraabhiprayaanno soochisthunnattu naakanipisthondi. Vimarsa eppuduuu manchide kaani 'Constructive criticism' ani oka padam gurchi meeku telise untundi, sarcastic gaa meeru chesthunnaaru kaabatti ilaanti tappulu dorluthaayani anukovadam lo artham undi kaani daanni saaku gaa teesukoni digajaaradam antha bhaavyam kaaademo ani naa aaalochana. Ika gollapudi gaari saahithi vyaasangam gurchi gaani, saahitya rangam lo aayana paatra gurchi kaaani meeku teleekundaane aayanni vimarshinchadam kuda peddaga nachaledu, aayana chelam, Bharago, Koku latho polchatagga goppa rachayitha/saahithi vettha kaaka povachu kaani saahithyam meeda meeku naaku unna daani kannaa ippatlo media lo ooka dampudu programs chese vaakhyaaathalakannaa manchi avagaahane unnadani naa abhipraayam. Anyadhaa bhaavinchakandi, vayassulo meekannaa chinna vaadini, alaa ani gollapudi gaariki veeraabhimaanini kaadu, evaru edi baagaa raasina vaarini mechukovadam, ilaa chinna chinna tappulu chesinapudu sadvimarsha cheyadam naakunna alavaatu. Meenundi marinni manchi vyaasaala kosam eduruchoosthunnaam.

    ReplyDelete
  13. @anonymous,

    రాజు గారు,

    మీకు వయసు ఎక్కువ తక్కువల బట్టి 'గారు' అని సంబోధించాలనే నియమం/పట్టింపు ఉన్నట్లుంది. నాకు లేదు.

    >> తెలుగు సాహిత్యంలో గొల్లపూడి మారుతీరావు స్థానం, స్థాయి ఏమిటో నాకు తెలీదు. తెలీకపోవడం అనేది నా తప్పవుతుంది గానీ గొల్లపూడిది కాదు. నా అజ్ఞానాన్ని మన్నించండి.<<

    తెలీదని నేనే రాశాను గదా! ఈ పోస్ట్ ఉద్దేశ్యం గొల్లపూడిని అంచనా వెయ్యటం కాదు.

    ఈ పోస్ట్ మొత్తం ఈ ప్రోగ్రాం ఎడిటోరియల్ పాలసీని, రామచంద్ర మూర్తిని విమర్శించాను.. నాకు నచ్చలేదు కాబట్టి.

    ఫైనల్ గా.. గొల్లపూడిలా రచయితని మాట్లాడనీకుండా డామినేట్ చేసేస్తూ ప్రోగ్రాం నడిపించడం గూర్చి మీరేమి మాట్లాడ లేదు.

    (ఇంతకీ మీకా ప్రోగ్రాం బాగుందో లేదో రాయలేదు.)

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  14. One of the best ones from you Ramana garu:)

    నేను ఒక మూడు నాలుగు చూసాను. గొల్లపూడి గారి గోలే తప్ప, అసలు వాళ్ళకి మాట్లాడ్డానికి అవకాశమే ఇవ్వరాయన. నేను చూసేదేమో వాళ్ళేం మాట్లాడతారో విందామని ఆసక్తిగా వెళ్తాను. వరసగా అలా ఆశాభంగం అయ్యాక చూట్టమ్ మానేశాను. ఈయన మాట్లాట్టంలో కొద్ది సార్లు పొగరు పాలు కూడా ఎక్కువగా అనిపించి, (ముఖ్యంగా వయసులో చిన్నగా ఉన్నవాళ్ళతో) చిరాకేసింది నాకు.

    ఇహ తెలుగు సాహిత్యంలో గొల్లపూడి గారి స్థానం ఏంటో నాకూ తెలీదు కానీ, ఆయన కాలమ్స్ నచ్చినంతగా, వారి రచనలు అంత గొప్పగా ఏం ఉన్నట్లుగా అనిపించలేదు నాకు. But I suspect he is a voracious reader.

    ""....అతనికి ఆ మాత్రం తలంటు పొయ్యకపొతే చలాన్ని, కుటుంబరావుల్ని కూడా తిరగ రాసే ప్రయత్నం చేసేవాడేమో...."'
    __
    What a line..sweet and straight :)

    ReplyDelete
  15. :) బాగా రాశారు.మనకున్న మచంచి కార్యక్రమాలే కొన్ని. వాటిని కూడా ఇలా ఏకి పారేస్తే ఎలాగండి.తెలుగంటే కాస్త అభిమానం, చదివే అలవాటు ఉన్న సాధారణ ప్రేకషకుడికి కొన్ని మంచి కథలని మార్కెటింగ్ చేసి వాళ్ళ చేత ఒక సారి చదువుదాం అనిపించే ప్రోగ్రాం ఇది అని అనుకుంటున్నా. అంతకుకు మించిన పరమార్థం దీనికుందని నేననుకోను.
    Considering the pathetic ignorance that we are in this is not small achievement.

    ReplyDelete
  16. KumarN గారు,

    నేను ఈ ప్రోగ్రాం ఎందుకు బాలేదో వివరంగా రాశాను.

    సాహిత్యంలో గొల్లపూడి గొప్పవాడే కావచ్చు. కానీ అతిధుల్ని మాట్లాడనీయకపోవడం అనేది ఏ రకమైన మర్యాద!

    గొల్లపూడి స్థానంలో శ్రీశ్రీ ఉన్నా సరే! మనం ఈ దుర్గుణాన్ని ఎత్తి చూపవలసిందే.

    ReplyDelete
  17. కార్యక్రమం లో గొల్లపూడి వారు ఎక్కువ మాట్లాదతారు అన్న నిజాన్ని ఒప్పుకుంటూ, పావని గారి తో ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  18. Pavani గారు,

    ఈ పోస్ట్ రాయడానికి (మీరు వెలుబుచ్చిన అభిప్రాయం నాక్కూడా ఉండటం చేత) కొన్నాళ్ళ పాటు ఊరుకున్నాను.

    >>ఎవరూ కూడా తెలుగు కథని చదివి ఉద్ధరించనవసరం లేదు. (మంచి కథలు మనని గ్యారెంటీగా ఉద్ధరిస్తాయి. మనం కథల్ని ఉద్ధరించలేం!)<<

    అందువల్ల రాసేశాను.

    మీరు చెప్పిన ద్వైదీభావం ఎప్పుడూ ఉంటుంది. 'ఇప్పుడు రామాయణం తీసేవాళ్ళే కరువయ్యారు. తీసినవాణ్ణి విమర్శిస్తే భవిష్యత్తులో ఈ మాత్రం తీసేవాళ్ళు కూడా నిరుత్సాహ పడతారు.' కూడా ఈ కోవకే వస్తుంది.

    'వస్తువు గొప్పదైనప్పుడు.. శిల్పం, శైలీ ఎంత నాసిరకంగా ఉన్నా.. పట్టించుకోకపోవడం మంచిది.' అనేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు.

    చలసాని ప్రసాదరావు "ఇలా మిగిలేం" అంటూ కమ్యూనిస్ట్ పార్టీల్ని విమర్శిస్తూ ఒక పుస్తకం రాశాడు. అప్పుడూ ఇదే ఆర్గ్యుమెంట్!

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  19. @ఊకదంపుడు,

    థాంక్యూ!

    ReplyDelete
  20. ఇంతకీ ... పాపం గొల్లపూడిదా? HM-టివి దా? అది చూసిన రమణదా? చూడమని ప్రేరేపించిన రమణ గారి (ఈ గారు అనేది మీలా నాకూ అంతగా నచ్చదు, అనవసరమాఇన తోక, ఎందుకు కొంతమంది దానికోసం ఆరాట పడి అడిగి పెట్టించుకుంటరో!:) )హాస్య-మిత్రుడిదా?

    ReplyDelete
  21. @SNKR,

    తిలా పాపం, తలా పిడెకెడు!

    ReplyDelete
  22. @SNKR: sankar gaaru, eee 'gaaru' ane thoka inthaku mundu nunchi gourava soochakangaa peddavaallani pilavadaaniki use chese vaaru, being a social animal manishiki konni paddathalu pravarthanaa niyamaalu anevi pettaaru anna maata, eee vishayam gurchi ramana gaariki baagaa telusu, ivi paatinchadam paatinchakava povadam anedi manam mental maturity meeda depend ayyuntundi,
    @Ramana garu: nenu telugu tv channels peddagaa choodanandi, idemi goppa vishayamgaa cheppukovatledu, kaaka pothe naaku panikoche vishayaalemi lekapovadam valla choodatledanthe, meeku gaaru ani thoka add chese niyamam laantidi emi ledu annaaru, santhosham adi mee abhipraayam, mee drukpatham alaa undani teleeka edo cheppadaaniki try chesaanu, inkaa antha matured kaaledu kada, uchitha salahalu ivvadam ikapai aapukuntaanu :) ika aa program baagundo ledo choodakunda cheppadaaniki mee antha matured kaadu nenu, so aaa program gurchi no comment.

    Bhavadeeyudu,
    Raju

    ReplyDelete
  23. రాజు గారు,

    నా సమాధానం మిమ్మల్ని బాధించినట్లుంది. క్షమించండి.

    ReplyDelete
  24. వెలమకన్ని ఒంటేలు6 May 2012 at 15:18

    మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా గొల్లపుడివారంతే,

    మంఛిటపా అందించారు

    ReplyDelete
  25. అనానిమస్ రాజు గారు, :)
    మీరు చెప్పింది వాస్తవమే. గొప్పవాడైన పురాణ పురుషులు, వుదా. భీష్ముడు గారు, ధర్మరాజు గారు కృష్ణుడు గారు అని ఎవరూ అనడం వినలేదు. దేవుళ్ళు ఎంతగొప్పవారైనా గార్లు పెట్టే సాంప్రదాయం లేదు అన్నది మీరు గమనించేవుంటారు. అంతెందుకు అమ్మనే అమ్మగారు అంటామా? చాలా అరుదు. పైగా 'ఎవడబ్బ సొమ్మని కులుకుచూ తిరిగేవు', 'రామా కనవేమిరా?' అనిపించుకున్న దేవుళ్ళూ, అన్న భక్తాగ్రేస్వరులూ వున్నారు. నేనన్న సందర్భం వేరు, అర్థం చేసుకోగలరు. నాకవకాశమివ్వకుండా రమణ గారు క్షమాపణ చెప్పేశారు, నేనేం చేయను?! ఓ స్మైలీ వేసేస్తా... :)

    ReplyDelete
  26. @Ramana&Sankar gaarlaku: Sir, kshaminchamani adigi nannu mariii peddonni cheseyyakandi, athi medhaavi thanam choopinchi meekanna peddavaadigaa kanapadaalane duraasha naaku ye maathram ledu, mee postlanni chadivaaka meemundu nenu chaalaa chinna vaadini eppudo decide ayipoyaanu, kaani ee okka post vishayamlo maathram kontha asamthrupthi, elaanti vaaraina ninda veyadam gaani, amaryaada ga vaari gurchi raayadam gaani konchem baadhinche vishayam kanuka edo meeku chesukuntunna vinnapaale gaani, hithopadesham ye maathram kaadu meeku eduru samadhaanam chepthunnanduku meere nannu kshaminchaali :), ika vyavaharika bhaashalo puraanaalni raasinapudu aa paathrala perlaku maryaada ivvaka poyi undavachu, kaani vaati maryaadanu kaapaaduthune raasaaru, meeru akkada kuda konchem jaagratta gaa gamanisthe, dharmaraju bheeshmudini eppudainaa bheeshmaa ani perutho pilichaadaa? ika amma garu naanna gaaru ane sambodhinche saampradaayam ippatiki akkadakkadaa kanapaduthundi, vaallu kuda mature ayyaaka alaa pilavadam maanesthaaru :)

    ReplyDelete
  27. రాజు గారు,

    కామెంట్లు చక్కగా రాస్తున్నారు. 'లేఖిని'తో తెలుగు రాయడం చాలా సులభం. ప్రయత్నించండి. తెలుగులో రాస్తే చదవేవారికి హాయిగా ఉంటుంది. అప్పుడు మనం ఎంచక్కా బోల్డన్ని కబుర్లు చెప్పుకోవచ్చు.

    ReplyDelete
  28. అదేం లేదు, మీరు క్షమాపణలు వెనక్కు తీసుకునేదాక మన రాజు వూరుకోరు(గారు లేకున్నా బహువచనం వాడాను). అలా ఎడాపెడా క్షమాపణలు చెప్పేసి జనాల్ని ఇబ్బది పెట్టకండి డాక్టారూ. :) ;)

    ReplyDelete
  29. ఆఫీస్ లో సమయం దొరికినపుడు ఎదో కొన్ని మంచి బ్లాగులు చదివేసి ఏమన్నా వ్రాయాలి అనిపిస్తే ఒకతి రెండు కామెంట్స్ వ్రాసి ఊరుకోవడం తప్ప, తెలుగు ఫాంట్స్ తో రాయలేక పోతున్నాను సార్, కెరీర్ ఆరంభం లో సమయం దొరక్కపోవడం ఒక కారణం అయితే, లేఖిని మా ఆఫీస్ లొ ఫాస్ట్ గా పని చేయకుండా మొరాయించడం మరొక్క కారణం. @శంకర్ గారు: లెస్స పలికితిరి :)

    ReplyDelete
  30. మా ఛానెల్ (నేను ఆ ఛానెల్ లో పనిచేసాను, మాతోనే మొదలైంది అది)ని అంతలేసి మాటలంటారా....హమ్మా ఉండండి మీ పని రామచంద్రమూర్తిగారితో చెప్తాను. నిజానికి ఈ ప్రోగ్రాం గురించి విన్నప్పుడు నేను చాలా ఆనందంతో మురిసిపోయాను. హమ్మయ్య ఇన్నాళ్ళకు మా ఛానెల్ లో తెలుగుకి సంబంధించిన ప్రోగ్రాం ఒకటి చేస్తున్నారు అని. కానీ చూసిన తర్వాత మీకంటే ఎక్కువ తిట్టుకున్నాను. గొల్లపూడి కాకుండా మామూలు వ్యాఖ్యతను పెట్టుకున్నా ఇంతకన్నా బాగుండేది, కథ గురించి, కథకుడి గురించి ఎక్కువ తెలిసేది అనిపించింది. కానీ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం గొల్లపూడి చేతిలో ఉంది. ఆయనే డిజైన్ చేసి నచ్చినట్టు చేస్తున్నారు. ఛానెల్ హెచ్ ఎమ్ టీవీని వాడుకున్నారు. రెండవది స్టూడియో హెచ్ ఎమ్ టీవీది కాదు. గొల్లపూడి సొంతపైత్యంతో కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నాడు. ఇక మీరన్న మాట, మూర్తిగారు పైపర్ నుంచి టీవికి వచ్చి తప్పుచేసారని. కానీ నేను దీన్ని విభేధిస్తాను. ఎందుకంటే దిశ, దిక్కు లేని తెలుగు న్యూస్ ఛానెల్స్ కు మూర్తిగారి లాంటి వాళ్ల అవసరం చాలా ఉంది. ఆయన కూడా అదే దృష్టితోనే వచ్చారు. పాపం చాలా కృషి చేస్తున్నారు కానీ అది అంత ఈజీ కాదు. అది ఆయనకు కూడా తెలుసు. మూర్తిగారు అనుకున్నది చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎన్ని అని అంటే చెప్పడం కష్టమే. మూర్తిగారికి చేయాలని సంకల్పం ఉన్నా ఆయన కిందవారి సహకారం తక్కువగా ఉంది ప్రస్తుతానికి. ఇంకా చాలా రకాలైన అవరోధాలూ ఉన్నాయి. కాబట్టి ఆయన సక్సెస్ సాధించేవరకు మనం కొంచెం ఓపిక పట్టాలి. క్షమించాలి.....ఛానెల్ పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మూర్తి గారిని చాలా దగ్గరుండి చూసి, ఆయన దగ్గర పనిచేసినదానిగా చెబుతున్నాను. మీ అభిప్రాయంలో ఎటువంటి తప్పూ లేదు, కానీ మీరు రాసిన దాన్ని చూసిన తర్వాత చెప్పాలనిపించింది. ఏమీ అనుకోవద్దు.

    ReplyDelete
  31. మనోజ్ఞ గారు,

    hmtv వందేళ్ళ తెలుగు కథ ప్రోగ్రాం గూర్చి నాకు తెలీని కొత్త విషయాలు చెప్పారు. థాంక్యూ!

    అయితే ఇదంతా గొల్లపూడి సొంత పైత్యం అన్నమాట! అందుకనేనా! ఈ ప్రోగ్రాంని తనదైన శైలిలో ఒక థర్డ్ రేట్ రియాలిటీ షో స్థాయికి దించేశాడు. కాబట్టే ఇది వందేళ్ళ నసగా తయారయింది.

    రేప్పొద్దున ఏ పరుచూరి సోదరులో తెలుగు కథని ఉద్దరిస్తాం (ఇప్పటిదాకా గుళ్ళు, గోపురాల్ని ఉద్దరించేవాళ్ళని చూశాం) అంటారేమోనని భయంగా ఉంది.

    కె.రామచంద్రమూర్తి మన తెలుగు జర్నలిజంలో ఒక విలక్షణమైన వ్యక్తి. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. మనం ఆయన ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు మిస్సయిపోతున్నాం.

    ReplyDelete
  32. To Sir with LOVE:

    http://www.koumudi.net/gollapudi/070212_tappudumatalu.html

    You can hear the V(N)OICE Too.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.