Wednesday 21 December 2011

సప్తపది

'నెమలికి నేర్పిన నడక ఇదీ' అంటూ టీవీలో సప్తపది సినిమా పాటొస్తుంది. పాతరోజులూ, అప్పటి స్నేహితులూ గుర్తొచ్చి నవ్వుకున్నాను. నాకు పాతసినిమాలు గొప్ప నోస్టాల్జియా.

ఇప్పుడంటే టీవీలు, కంప్యూటర్లు వచ్చేశాయిగానీ, చిన్నప్పుడు మాకు సినిమాలే వినోదం. సినిమా చూడ్డం అనేది ఓ గ్రూప్ ఏక్టివిటీ. పరీక్షలప్పుడు చదువుకోవడం, పరీక్షలు లేనప్పుడు సినిమాలు, షికార్లు, కబుర్లు. ఇదే మా జీవితం.

ఎక్కడైనా గ్రూప్ ఏక్టివిటీస్ బాగానే వుంటాయిగానీ, సాధారణంగా గ్రూపుల్లో నోరున్నోడిదే రాజ్యంగా వుంటుంది. కొంతమంది తమ ఇష్టాన్ని అందరి ఇష్టంగా (కష్టంగా) మార్చడానికి కృషి చేస్తారు. కుదరకపోతే కక్ష సాధింపులకి దిగుతారు. ఈ బాధలు పడలేని సౌమ్యులు సర్దుకుపోతారు.

గ్రూపులో ఎవరిష్టం ఎక్కువ చెల్లుబాటు అవుతుందో వాడే అప్రకటిత నాయకుడు. అందువల్ల సినిమా ప్రోగ్రాంని కొందరు తమ నాయకత్వానికి సవాలుగా తీసుకునేవాళ్ళు. బయటకి కనబడేది సినిమా ప్రోగ్రామే అయినా లోపల విషయం చాలా లోతుగా ఉంటుంది. అందుకే సినిమా ప్రోగ్రాం అనంగాన్లే అనేక చర్చలు నడిచేవి.

మాది నానాజాతిసమితి కావున - 'ఫలానా సినిమా అయితేనే వస్తాను' అనే మొండివాళ్ళు నుండి 'ఏ సినిమా అయినా ఏముందిలే' అని సర్దుకుపోయే త్యాగరాజులు వుండేవాళ్ళు. ఒకడిది బిచ్చగాడిలా బ్రతిమాలే ధొరణి అయితే ఇంకోడిది పోలీసోడిలా బెదిరించే తత్వం. 

నాయకత్వం ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో (అనుచరగణాన్ని కాపాకుడుకోవాలిగా) చచ్చినట్లు కొన్ని సినిమాలు చూడ్డానికి ఒప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఆ ఉక్రోశం, ఆగ్రహం అంతా ఆ సినిమా మీద కక్కేవాళ్ళు. 

అలాంటి పరిస్థితుల్లో మా చేతిలో దారుణంగా హత్య చెయ్యబడ్డ సినిమా 'సప్తపది'. ఆ రోజు కొంతమంది అప్పటికే రెండుసార్లు చూసేసిన శ్రీదేవి సినిమా మళ్ళీ చూడాలని ప్లాన్ వేశారు. మాలో కొందరు మర్యాదస్తులు సప్తపది చూడాల్సిందేనన్నారు. తీవ్ర వాదప్రతివాదాల తరవాత - 'సప్తపది'కే వెళ్ళాం.

శ్రీదేవి సినిమా బ్యాచ్ వాళ్ళు సప్తపది సినిమా చూస్తున్నంతసేపూ కుళ్ళుకు చచ్చారు. తమ చెత్త కామెంట్లతో సినిమాని చీల్చి చండాడ్డం ప్రారంభించారు.

"శంకరాభరణం సింగిల్ పిలకతో సూపర్ హిట్టైంది. ఇది మూడుపిలకల సినిమా, ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో!"

"వీడెవడ్రా నాయనా! వీడికి భార్యలో దేవత కనిపిస్తుంది! రేపు మన పనీ ఇంతేనా!?" ఒకడి ధర్మసందేహం.

"ఇంతోటి సినిమాకి అమరావతి గుడెందుకు? మనూళ్ళో శివాలయం సరిపొయ్యేది."

"పాటలు బాగున్నాయి, హరికథా కాలక్షేపంలాగా!"

"పొద్దస్తమానం ఎలకపిల్ల హీరోయిన్తో గుడి చుట్టూతా కూచిపూడి నాట్యం వేయిస్తున్నారు. శ్రీదేవి డాన్స్ ఒక్కటుంటే ఎంత బాగుండేది!" ఒక శ్రీదేవి డై హార్డ్ ఫ్యాన్ ఆవేదన!

"ష్.. మాట్లాడొద్దు, సినిమా అర్ధం కావట్లేదు." మేం ఆ సినిమాకి వెళ్ళడాటానికి కారకుడైన ఒక మర్యాదస్తుడు విసుక్కున్నాడు.

"అర్ధం కావట్లేదా! ఇది ఖచ్చితంగా అవార్డు సినిమానే." కసిగా సమాధానం.

సినిమా చివరికొచ్చింది. 

"ఈ సినిమా బ్రామ్మల సినిమా. ఒక పెళ్ళయిన బ్రామ్మలమ్మాయిని లేవదీసుకుపోవటానికి దళితుడు రెడీ అయ్యాడు. పూజారిగారు దొడ్డమనసుతో పంపించారు. ఇదేకథని రివర్స్ చేసి దళితవాడలో ఒక బ్రామ్మల కుర్రాడు దళిత యువతిని లేవదీసుకుపోయేట్లుగా.. అందుకు దళితులందరూ దొడ్డమనసుతో ఒప్పుకుంటున్నట్లుగా తీయొచ్చు. కానీ దర్శకుడు పొరబాటున కూడా అలా తీయడు. ఆయన ఎజండా వేరు." ఒక కంచె ఐలయ్య అబ్జర్వేషన్!

సినిమా అయిపోయింది. అందరం బయటకొచ్చాం. ఆ సినిమా చూద్దామని ఉబలాటపడ్డ దురదృష్టవంతులు రెండుచేతులూ జోడించి నమస్కరించారు. "ఏదో పాటలు బాగున్నాయని ఈ సినిమా ప్రపోజ్ చేశాం. ఒక సినిమా చూడటం ఇంత దుర్భరంగా ఉంటుందని నేడే గ్రహించాం. ఇంక జీవితాంతం మీరు చెప్పిన సినిమాలే చూస్తాం." అని సరెండర్ అయిపొయ్యారు. వెనకనుండి ఎవరిదో వికటాట్టహాసం!

నాకు సినిమా కంటెంట్ ముఖ్యం కాదు. చాలాసార్లు సినిమా పేరు తెలీకుండా సినిమా చూశాను! నా దృష్టిలో సినిమా అనేది స్నేహితులతో కలిసి జస్ట్ టైమ్ పాస్, ఫన్ - అంతే. అందుకే 'ఆ సినిమా ఎవరెవరితో చూశాం. అప్పుడేం జరిగింది.' లాంటి జ్ఞాపకాలే నాకు ఇష్టం! 

46 comments:

  1. గురువుగారూ,మీ పోస్ట్ల కోసం మా కళ్ళలో కాయలు కాయించేస్తున్నారు, కొంచెం తీరిక చేసుకుని కనీసం రెండు రోజులకి ఒక్కటి చొప్పునయినా వ్రాయ వలసిందిగా మా ప్రార్థన.

    ReplyDelete
  2. హమ్మయ్య, పేర్లు బయటకు రానీకుండా బహు చక్కగా రాసావు! నాకూ బాగానే గుర్తుంది. నీ వర్ణన వల్ల మన మిత్రులందరినీ గుర్తించా. పాతరోజుల్ని అద్భుతమైన రచనతో గుర్తుకుచేసావ్, పర్వదిన సెలవుల్లో, ధన్యవాదాలు

    ReplyDelete
  3. @అజ్ఞాత..
    ధన్యవాదాలు.
    ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  4. TJ "Gowtham" Mulpur..
    "పాతరోజుల్ని అద్భుతమైన రచనతో గుర్తుకుచేసావ్."
    థాంక్యూ మిత్రమా.
    ఈ సినిమా కామెంట్లు మనకి మామూలే.
    కానీ కొంతమందికి 'మనోభావాలు' గాయపడ్డాయిట!
    ఈ పోస్ట్ ఎవర్నో కించపరచటానికి రాసింది కాదు.
    అర్ధం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి.

    ReplyDelete
  5. సప్త లో పది లొసుగులు కనబెట్టిన మీ 'మైత్రేయుల ' సినిమా రివ్యూ కౌశల్యం అమోఘం రమణ గారు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. govindaraju ramana22 December 2011 at 03:15

    ఆ రోజులే వేరు. ఆ మధుర స్మృతులు గుర్తు చేసినందుకు చాలా థాంక్స్.
    మనలో కొంతమంది, నువ్వు చెప్పినట్టు సినిమా పేరు కూడా తెలీకుండా చూసేవాళ్ళు.
    తెలుగు చదవడం రాని రఘునాథ్ అయితే పోస్టర్ చూపించి అదేం సినిమా గురూ! అని అడిగి మరి చూసేవాడు.
    మొత్తానికి పేర్లు బయటకి రాకుండా చాలా 'డిప్లొమాటిక్' గా రాసావు.
    కొందరికయితే తెరమీద బొమ్మ ఆడటమే చిత్రం.
    మరి కొందరు చూసిన సినిమానే మళ్లీ ,మళ్లీ చూసే వాళ్ళు. (ఫ్రెండ్స్ కి కంపెనీ ఇవ్వటం కోసం.)
    ఇప్పుడు సినిమాలు అలా 'ఎంజాయ్' చెయ్యలేము.
    సినిమాల్లో తేడానో, లేక మనకి వయసుతో వొచ్చిన తేడానో తెలీదు.
    గో వె ర

    ReplyDelete
  7. జిలేబి గారు..
    మీ కామెంట్ గమ్మత్తుగా ఉంది.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  8. గో వె ర..
    పాతరోజులు మళ్ళీ రావు.
    అవన్నీ స్వర్ణయుగపు రోజులు.
    ఈ పోస్టులో పేర్లు రాయలేదు.. ఎక్కువయిపోతాయని.
    నీ పేరుతో మనం చేసిన john lennon నిరాహార దీక్ష రాశానుగా!

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. విశ్వనాథ్ తీసే సినిమాలు హిందూ సంప్రదాయవాదాన్ని బలపరిచే విధంగానే ఉంటాయి కానీ ఏమాత్రం అభివృద్ధికరంగా ఉండవు అని నా స్నేహితురాలు మండవ స్వప్న చెప్పింది. నేను విశ్వనాథ్ సినిమాలలో ఒకటో, రెండో మాత్రమే చూసినట్టు గుర్తు.

    ReplyDelete
  11. I don't mean to launch into some serious diatribe, but, I am troubled by Niharika's (I am sure well meaning) story. While purportedly professing progressiveness, the story propagates regressive stereotype as if non-Brahmins are incapable of honesty. This is as bad as the story that Parashurama figured out Karna was Kshatriya because he wouldn't flinch when a bee burrows into his leg and makes him bleed. It is the same as the potrayal of a Christian or Muslim hero in Indian movies as the long lost Hindu son or something. I think Ramana's Kanche Ilaiah was talking exactly against this highhanded stereotypical perspective.

    ReplyDelete
  12. నీహారిక గారు..
    >>"బ్రాహ్మణేతరుడు ఇలా ఉన్నదున్నట్లు సత్యాన్ని పలుకలేడు, నిజాన్ని పలుకడం బ్రాహ్మణుడి గుణం - నైజం.... సత్యాన్ని దాచక చెప్పినందువల్ల సత్యగుణాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణుడివని నా అభిప్రాయం."

    అంతేనంటారా!

    ReplyDelete
  13. లేఖిని22 December 2011 at 16:09

    నీహారిక గారు,

    కబుర్లూ కాకరకాయలూ కట్టిపెట్టీ విషయం సూటిగా చెప్పండి.

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. నీహారిక గారు,
    *భగవంతుడు వీళ్ళకి దైర్యం ఇవ్వలేదు కానీ తెలివితేటలు మాత్రం ఇచ్చాడు .*
    మీ దృష్ట్టిలో ధైర్యం అంటే ఎమీటి? దానిని ఎలా నిర్వచిస్తారు?
    Sri

    ReplyDelete
  17. లేఖిని22 December 2011 at 20:44

    అమ్మా తల్లీ, ఏదైనా అవగాహన కలిగించే విషయం చెప్తారేమో అని అడిగా. అంతేగానీ మీ అనుభవాలూ, అపోహల ద్వారా పెద్ద పెద్ద విషయాలను ఇలా సింపుల్ గా థీరైజ్ చేస్తారనుకోలేదు

    ReplyDelete
  18. Extremely sorry. In any of our mythological (original) scripts never narrated or described anything about treating the one "VARNA" against the other "VARNA" are below par in any field, but clearly distributed the duties according to their life style basing on the physical & mental abilities keeping everything for the well being of the total society. The unfortunate thing is what we were taught now is not exactly what the original scripts reflects. It is the distortion by the vested interested historians and foreign religious organizations, and still trying to keep us not to be on correct track. Finally I would like to express that good and bad people are commonly available in every "VARNA" then and now but only difference is "then" the society was with positive minded people were more.

    ReplyDelete
  19. While what the above anonymous said is desirable and appreciated.. the question is "How far is that from the truth?"

    Weren't the original scriptures deciding stuff by birth based on previous incarnations !!!

    ReplyDelete
  20. రమణ గారూ, మీ అనుభవం బావుంది. :) ఈ సినిమా నాకెందుకో అంతగా నచ్చలేదు. కొన్ని సన్నివేశాలు కూడా కొంచెం అతి అనిపిస్తాయి, నిజాయితీగా చెప్పాలంటే. మొన్నామధ్య సామవేదం షణ్ముఖశర్మ గారు మా ఊరొచ్చినప్పుడు ఈ సినిమాని ఏకేశారు ఇండైరెక్ట్‌గా.

    కాస్త మీరు నన్ను క్షమించాలి. మీ బ్లాగ్ వేదిక అయినందుకు. కానీ నీహారిక గారికి ఒక చిన్న క్వెస్చెన్.

    నీహారిక గారూ,

    "భగవంతుడు వీళ్ళకి దైర్యం ఇవ్వలేదు కానీ తెలివితేటలు మాత్రం ఇచ్చాడు "
    భగవంతుడు బ్రాహ్మణులకి ధైర్యం ఇవ్వలేదు, మిగతా కులాలకి/వర్ణాలకి తెలివితేటలు ఇవ్వలేదనా మీ ఉవాచ?

    బాగా చెప్పారు. వాళ్ళ తెలివితేటలతో బ్రాహ్మణులు మీవారిని మాయ చేసి మంత్రం వేసి మార్చేశారా? మరి మీరేం చెయ్యలేకపోయారా? అంటే మీకు తెలివితేటలు లేవా? పోనీ మీ లెక్క ప్రకారమే ధైర్యం ఉండాలిగా? మరి ఆ ధైర్యంతో మీవారికి జ్ఞానోదయం చెయ్యకపోయారా? ఆ ధైర్యం చెయ్యకుండా, బ్రాహ్మణుల మీద పగ పెంచుకోవటం కొంచెం అధైర్యం అనిపించటం లేదు? ఇటు తెలివితేటలు లేక, అటు ధైర్యమూ లేక మీరు భగవంతుడు సృష్టించిన ఏ వర్గానికి/వర్ణానికి చెందుతారు?

    అయినా భగవంతుడు వీళ్ళకి స్పెసల్‌గా ఎలా తెలివితేటలని ఇచ్చాడు? మీరు చెప్పిన కథలో నీతి ప్రకారం, మీ పదాల్లోనే
    "కాబట్టి వర్ణవ్యవస్థా నిర్ణయంలో జన్మకు ఏమాత్రం స్థానం లేదు. గుణానికే ప్రాధాన్యం."
    మరి దేవుడు అలా స్పెసల్‌గా మీరు చెప్పే బ్రాహ్మణులకే తెలివితేటలు ఇచ్చాడంటే, వాళ్ళు గుణాధికులన్నట్టేగా? మరి అంతటి గుణాధికుల మీద పగ పెంచుకోవటం తమరి అజ్ఞానం కాదూ?

    మీ మాటలని మీరే ఖండించుకుంటూ "దైవీ సంపద " అయిన సత్యాన్ని విస్మరించి అసత్యం పలుకుతున్నందుకు అబ్బే, మీరు బ్రాహ్మణులు కాలేరు, జన్మతో కాదు గుణంతో కూడా.

    ReplyDelete
  21. >>>Weren't the original scriptures deciding stuff by birth based on previous incarnations !!! >>>

    No. They don't DECIDE, they only GUIDE if you believer. It is all matter of faith.

    Muslims believe that they go to Heaven and enjoy with 72virgins if they do jehad. We won't get that if we do jehad, right?

    >>the question is "How far is that from the truth?">>

    Very vague question. Upto you to measure it with tape for yourself, if you know where the truth is.

    ReplyDelete
  22. Ramana gaaroo,

    Often you say your blog is for fun 'ONLY' and never to be taken seriously. However, the comments are drifting the spirit to a debate.. Surprising thing is your response to Niharika's comment...

    Coming to my question, which group were you in while you watched the movie :)

    Regards

    Ram

    ReplyDelete
  23. @Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)

    "Weren't the original scriptures deciding stuff by birth based on previous incarnations !!! "
    Could you explain what you meant by "original scriptures deciding stuff by birth ..."? What do you mean by an incarnation? Do you mean it is the same as the birth? Who said that "Original scripts decide stuff" What is "stuff" btw?

    బ్రహ్మజ్ఞానం పొందగలిగే అర్హత కలవాడు, కలిగినవాడు బ్రాహ్మణుడుగా పిలవబడతాడు అని మాత్రమే చెప్పారు. బ్రాహ్మణ కుటుంబం as in బ్రహ్మ జ్ఞానం పొందిన, పొందే అర్హత కలిగిన, పొందేటటువంటి కార్యాలు నిర్వహించే కుటుంబంలో జన్మిస్తే ఆ బ్రహ్మజ్ఞానం మీద అభిలాష, పొందాలన్న తీవ్రమైన కోరిక సహజసిధ్ధంగా అలవడే అవకాశం చాలా ఎక్కువ. చెప్పులు కుట్టుకునే వాడికి, మాంసం కొట్టేవాడికి బ్రహ్మజ్ఞానం కలగదా అంటే భేషుగ్గా కలుగుతుంది ఆ జ్ఞానం సంపాదించగలిగే అర్హత ఉంటే. కానీ చాలా కష్టపడవలసి ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఉండే పరిస్థితులు అనుకూలంగా ఉండవు కాబట్టి. కానీ అదే బ్రాహ్మణ పధ్ధతులు పాటించే కుటుంబంలో పుడితే ఆ మార్గం సులువవుతుంది. ఇంతే నాకు తెలిసిన తేడా. ఇదివరకు అందరి వర్ణాలనీ, వారి వారి వృత్తులనీ అందరూ గౌరవించుకుంటూ ఉన్నప్పుడు అంతా బానే ఉండేది. కానీ వ్యక్తుల మీద కాకుండా ద్వేషాన్ని అర్థం పర్ధం లేకుండా వర్ణాల మీద పెంచుకుంటే వారికి కలిగేది మిడిమిడి జ్ఞానమే. బ్రహ్మజ్ఞానం చాలా దూరం.

    ReplyDelete
  24. అయ్యా.. ఎవరెన్ని విధాలుగా కవరింగులు చేసుకోవాలని చూసినా.. మన భారత దేశంలో కొన్ని వందల ఏళ్ళ పాటు మనుషుల్ని వారి పుట్టుక ఆధారంగా స్థాయిని నిర్థారించి, కొన్ని కులాల్లో పుట్టినోల్లని గొప్పోల్లుగా చూస్తూ, కొన్ని కులాల్లో పుట్టినోల్లని అధములుగా పరిగణిస్తూ, వారిని ఊరవతలకి నెట్టేసి, వారిని కనీసం సాటి మానవులుగా కూడా చూడలేదనేది జగమెరిగిన సత్యం. ఇలా చేయమని వేదాల్లో ఉందా లేదా అనేది ఎవరి సౌకర్యానికి అనుకూలంగా వారు వాదించుకోవచ్చు. ఒకవేళ వేదాల్లో లేకపోతే ఇలా ఎవరు చేశారు..? శూద్రులు తమకు తామే, తాము అధములమని డిక్లేర్ చేసేసుకొని ఊరవతలకి స్వచ్చందంగా వెల్లిపోయారంటారా..? అన్నా అంటారు లెండి.

    ReplyDelete
  25. సీతారాం గారు..

    కొన్ని సినిమాలు, రచనలు మెచ్చుకోవటానికి, మెచ్చుకోవపోవటానికి మనకున్న రాజకీయ అవగాహన కూడా ముఖ్యం.

    వేయిపడగలు, మహాప్రస్థానం రెండూ నచ్చినవాడు అమాయకుడయినా అయి ఉండాలి. లేదా 'ఒక' అబద్దం చెబుతున్నవాడయినా అయి ఉండాలి.

    కేవలం శిల్పం మాత్రమే బాగున్నంత మాత్రాన (విశ్వనాథ్ అత్యంత ప్రతిభావంతుడు) వస్తువుని ఇగ్నోర్ చెయ్యలేం కదా!

    ఇక విశ్వనాథ్ సినిమాల గూర్చి నా అభిప్రాయం.. బాలగోపాల్ తన 'రూపం - సారం' లో వెలుబుచ్చిన అభిప్రాయాల్ని పూర్తిగా సమర్ధిస్తున్నాను. అందుకే ఆయన 'శంకరాభరణం' రివ్యూ కొంత ప్రచురించాను.

    ఈ చర్చలన్నీ ముప్పై ఏళ్ళ క్రితమే వాడిగా సాగాయి. విశ్వనాథ్ గూర్చి కొత్తగా రాసేదేముంది!

    ఇవ్వాళ విశ్వనాథ్, బాపు సినిమాలని మెచ్చుకునేవాళ్ళు, విమర్శించే వాళ్ళు.. ఇద్దరూ కూడా స్పష్టంగానే ఉన్నారు!

    ReplyDelete
  26. http://en.wikipedia.org/wiki/Brahmin

    " After Sage Parshuram destroyed the Kshatriya race, he was excluded by other Brahmin communities and denied to perform any religious ceremonies for him. At the coast of Arabian sea i.e. the Western Ghats he decided to create a new Brahmin community where he found dead bodies of people came out floating from the sea. He purified them with Agni and brought back to life. Then he taught them all the veda's, weapons, religious knowledge and made the Brahmin known as Chitpavan Konkanastha Brahmins"

    Which Brahmin here is being debated, here?

    శూద్రులు తమకు తామే, తాము అధములమని డిక్లేర్ చేసేసుకొని ఊరవతలకి స్వచ్చందంగా వెల్లిపోయారంటారా..? అన్నా అంటారు లెండి.
    Yes, you are right. Aren't we seeing many forward caste climing themselves as most backward to get reservations? If not why there are so many A,B,C,D,E,F catogories?

    ReplyDelete
  27. అయ్యా అజ్ణాత గారు,

    ఇక్కడ ఎవరు కవరింగులు చేసుకోవలసిన అవసరం ఎవరికి లేదు. కాకపోతే ఎప్పుడు చూసిన కొన్ని వర్గాల వారే రొడ్డుకొట్టుడు పాట పాడుతుంటారు. అలా వారు పాడటానికి వారికి తగిన కారణాలు ఉన్నాయి.ఈ పాట పెద్దగా పాడి, వారి వర్గాల జనసంఖ్యని పోగేసి, రాజాధికారం చెప్పట్టాలని ఒకప్పుడు పెద్ద ప్రణాళికలు వేశారు. కొంతమంది ప్రజా చైతన్యం పేరుతో పోరాటం చేయకుండా, పుస్తకాలు రాసుకొని తృప్తి చెందారు. ఆ పుస్తకాలలోని నిజానిజాల పై చర్చ పేడితే వారికి ఉలుకు. మరి కొంతమంది మావోలలో చేరి, కొంతకాలం వుండీ, బయటకు వచ్చారు. అలా రావటానికి పెద్ద కారణం ఎమీ లేదు. వారేదో తమ జీవితకాలంలో కలలు గన్న రాజ్యం వస్తుందని, దానిలో పెద్ద పదవులు చేపట్టవచ్చని పోతే, రోజుకో కొండ మీద నిద్ర, పగలంతా కాళ్ళు వచ్చేటట్లు నడవటం,గుట్టలు ఎక్కడం దిగటం, అప్పుడప్పుడు బోనస్ గా కొన్ని యంకౌంటర్లు. ఇవ్వనిటిని చూసి, ఈ రాజ్యం ఇప్పుడల్లా వచ్చేటట్టుగాలేదని తెలుసుకొన్నవారు, ఆ పోరాటాన్ని ఆ అతివాద ఎర్ర పార్టీలోని అగ్రవర్ణాలవారికే వదలి, జనజీవన స్రవంతిలో చేరిన వీరు, మాకు అన్యాయం జరిగిందని దండోరా వేసుకోవటం మొదలు పెట్టారు. ఈ మాజిల లో కొంతమంది, అప్పుడప్పుడు తమ గుర్తింపు కొరకు, మావోలలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే అని స్టేట్మెంట్ ఇస్తూంటారు. ఇవ్వన్ని మీకు తెలియదని అనుకోము. నువ్వు చెప్పిన ఊరికి అవతల తోలిన వారిలో అన్నివర్గాల వారు ఉన్నారు. వారేమి ఒక్క కులానికి చెందినవారు కాదు.

    Sri

    ReplyDelete
  28. by stating that caste/caste discrimination was not part of hinduism we are fooling only ourselves......

    ReplyDelete
  29. అయ్యా అజ్ణాత,
    ఇక్కడ ఎవ్వరు హిందూమతం లో కులాలు లేవు, విభేదాలు లేవు అని వాదించటంలేదు. మీరు ప్రపంచమంతా తిరిగి సర్వ మానవ సమానత్వం పాటించే ఒక్క దేశాన్ని/ ప్రదేశాన్ని చూపిస్తే వేళ్లి,చూసి తరిస్తాం.

    Sri

    ReplyDelete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
  31. >>>>>
    వేయిపడగలు, మహాప్రస్థానం రెండూ నచ్చినవాడు అమాయకుడయినా అయి ఉండాలి. లేదా 'ఒక' అబద్దం చెబుతున్నవాడయినా అయి ఉండాలి.
    >>>>>
    పరస్పర విరుద్ధమైన రెండు సిద్ధాంతాలని నమ్మేవాళ్ళు ఉంటారు. ఒకడు తన భార్య వైపు పరాయి మగవాడు కన్నెత్తి చూడకూడదు అనుకుంటాడు. కానీ అతను తన కూతురి చేత టివి కార్యక్రమంలో మిని స్కర్ట్ వెయ్యించి డాన్స్ చెయ్యించి ఆమె టాలెంట్ చూపించాలనుకుంటాడు.

    ReplyDelete
  32. <>

    లేదా - రెండింట్లోనూ సిద్ధాంతాల్నీ, నమ్మకాల్నీ కాకుండా కామన్ గా ఉండే టాలెంటునో,అందాన్నో చూస్తున్నాడని కూడా అనుకోవచ్చు.

    ReplyDelete
  33. మితృలారా..
    చర్చంతా నా టపా మీద తప్ప అన్ని విషయాల మీదగా నడుస్తుంది.
    నా చిన్నప్పటి సినిమా కబుర్లు రాశాననుకుంటున్నాను.
    రాయలేదా?
    గుర్తు రావట్లేదు!

    ReplyDelete
  34. @padma gaaru,

    https://plus.google.com/u/0/103145057876600078379/posts

    ReplyDelete
  35. Dear Ramana, sorry to continue the OT discussion.
    Like the late Jazz singer Ella Fitzgerald said, "It's not where you came from, it's where you're going that counts." It is about time we relegated Manu and castes to the dustbin of history. It is completely unacceptable to support or even explain the caste system in the 21st century. It is evil - pure and simple. Like the study says below capitalism and free markets actually can cure this menace more than anything else. http://www.nytimes.com/2011/12/22/world/asia/indias-boom-creates-openings-for-untouchables.html?pagewanted=1&_r=1
    http://casi.ssc.upenn.edu/system/files/Markets+and+Manu+-+Chandra+Bhan+Prasad.pdf
    BSR

    ReplyDelete
  36. "సినిమా అనేది స్నేహితులతో కలిసి జస్ట్ టైం పాస్. ఫన్. అంతే. అందుకే 'ఆ సినిమా ఎవరెవరితో చూశాం. అప్పుడేం జరిగింది.' లాంటి జ్ఞాపకాలే నాకు మధురస్ప్రుతులు. సినిమాలోని మంచిచెడ్డలకి పెద్ద ప్రాముఖ్యం లేదు!"

    Righto!!

    ReplyDelete
  37. indian minerva ..
    ఈ పాయింట్ చెప్పటం కోసమే ఈ పోస్ట్ రాశాను.

    చర్చ మాత్రం పక్క దోవ పట్టింది.

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  38. /ఈ పాయింట్ చెప్పటం కోసమే ఈ పోస్ట్ రాశాను.
    చర్చ మాత్రం పక్క దోవ పట్టింది/

    ఈముక్క చెప్పడానికి మీరు పేద్ద పోస్ట్ రాశారు, ఐనా జనాలు పట్టించుకోలేదు. తన్నుకు చచ్చారు కదూ? :))

    ReplyDelete
  39. /కొన్ని సినిమాలు, రచనలు మెచ్చుకోవటానికి, మెచ్చుకోవపోవటానికి మనకున్న రాజకీయ అవగాహన కూడా ముఖ్యం./

    హ్మ్..

    బాల గోపాల్ గారు చెప్పారు అంటే, అది భగవద్గీతే !

    ReplyDelete
  40. Mauli గారు..
    >>"కొన్ని సినిమాలు, రచనలు మెచ్చుకోవటానికి, మెచ్చుకోవపోవటానికి మనకున్న రాజకీయ అవగాహన కూడా ముఖ్యం./

    హ్మ్..

    బాల గోపాల్ గారు చెప్పారు అంటే, అది భగవద్గీతే !"

    ఈ ముక్కలు చెప్పింది నేనే! బాలగోపాల్ కాదు!!

    ReplyDelete
  41. నీహారిక గారు..
    మీ వ్యాఖ్యలు పబ్లిష్ చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదంటారు!
    చాలా స్వీపింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
    చర్చంతా మీ కామెంట్ల మీదే నడుస్తుంది.
    చివరికి మీ కామెంట్లు తొలగించుకుంటున్నారు.
    దయచేసి నా ఇబ్బందిని గమనించగలరని భావిస్తున్నాను.

    ReplyDelete
  42. /ఇక విశ్వనాథ్ సినిమాల గూర్చి నా అభిప్రాయం.. బాలగోపాల్ తన 'రూపం - సారం' లో వెలుబుచ్చిన అభిప్రాయాల్ని పూర్తిగా సమర్ధిస్తున్నాను. అందుకే ఆయన 'శంకరాభరణం' రివ్యూ కొంత ప్రచురించాను./

    బాలగోపాల్ గారి గురించిన నా వ్యాఖ్య మీరన్న పై వ్యాఖ్యానం గురించి అండీ. కోట్ చెయ్యడానికి బద్దకించాను. మీనుంచి మరిన్ని ఇటువంటి వ్యాసాలు, జ్ఞాపకాలు ఆశిస్తున్నాము

    ReplyDelete
  43. రమణ గారూ, మీ టపా చూస్తుంటే నా చిన్ననాటి అనుభవాలు ఎన్నో గుర్తు వచ్చాయి. అలాగే ఒక రెండు సినిమా సంబంధిత జ్యాపకాలు కూడా.

    మొదటిది "సినిమా సినిమా" చిత్రం. ఈ semi-documentary లో Bollywood movies గురించి అనేక విషయాలతో బాటు ప్రేక్షకుల interaction కూడా చూపించారు. ఉదాహరణకు సినిమా చూస్తున్న ఒక ప్రేమ జంట చిత్రం లోని సన్నివేశాలకు ఎలా స్పందిస్తారో చాలా ఆసక్తికరంగా చూపించారు. యుగళ గీతాలు వచ్చినప్పుడు వారు తమను ఊహించుకుంటారు. వెండితెరపై నాయకుడు నాయిక మీద కవిత్వం రాస్తే, మన ప్రేక్షక నాయకుడు తన ప్రియురాలిపై కవిత్వం ధియేటర్ అందరికీ వినిస్పిస్తాడు. భగ్నప్రేమికుడయిన కవి తెరపై ఆత్మహత్య చేసుకున్నప్పుడు, సినిమా చూస్తున్న జంటలో emotions స్పష్టంగా కనిపిస్తాయి: తన ప్రియుడు కూడా కవి కాబట్టి ఎక్కడ ఏ అఘాయత్యం చేసుకుంటాడో అని ఆమె ఆందోళన. ఈ సినిమా మళ్ళీ చూద్దామని ఎంత ప్రయత్నించినా అది తిరిగి రాలేదు.

    రెండవది కొంత మంది మిత్రులతో గురుదత్త్ ప్యాసా చిత్రం మీద ఘంటల పాటు చేసిన చర్చ. మేము ఆ సినిమా కలిసి చూడలేదు. విడిగా వేర్వేరు సమయాలలో చూసిన చిత్రం గురించి క్లాస్సులే కాక భోజనం మానేసి మేము మాట్లాడుకుంటుంటే, మిగిలిన స్నేహితులు ముక్కు మీద వేలేసుకున్నారు. సినిమాలపై చర్చలు మాకు మామూలే అయినా, 8-9 ఘంటలు వేడిగా, దాదాపు కొట్టుకునే అంత వాడిగా నాకు ఇంకే అనుభవం గుర్తు లేదు.టీవీ లో ఈ మధ్య చూసే చెత్త చర్చల కన్నా ఏంటో రసవత్తరంగా, ఆసక్తికరంగా మా చర్చలు జరిగేవి. విచిత్రం ఏమిటంటే వామపక్షవాదంతో నాయకుడిని, సాహిర్ కవిత్వాన్ని మెచ్చుకున్న వ్యక్తులు ఒకవైపయితే, అదే వామపక్షవాదంతో చిత్రాన్ని, దాని స్పూర్తికర్తలను విపరీతంగా తిట్టిన వారు మరో వైపు. ఈ కామ్రేడుల దృక్పథాలు అన్ని విధాల కలిసేవి, తమ ఆశయాలను ప్యాసాకు అన్వయించడంలో తప్ప.

    ReplyDelete
  44. Jai Gottimukkala గారు..

    చాలా మంచి కామెంట్ రాశారు. ధన్యవాదాలు.

    గురుదత్ 'ప్యాసా' గూర్చి గొప్ప రివ్యూలు చాలా ఉన్నాయి.

    కానీ.. ఆ సినిమా గూర్చి గంటల కొద్దీ మీ స్నేహితులు చేసుకున్న వాదోపవాదాలు కలకాలం గుర్తుండిపోతాయి.

    మాకయితే ఏ సినిమా అయినా చర్చనీయాంశమే!

    ఒక్కోసారి ఉద్రిక్తతలకి దారి తీసేవి.

    కొత్తవాళ్ళయితే ఇంక వీళ్ళు మాట్లాడుకోరు అనుకునేంత గొడవలయ్యేవి.

    కానీ.. మరుసటి రోజు అందరం మళ్ళీ భాయి భాయి!

    ReplyDelete
  45. >>"ఈ సినిమా బ్రామ్మల సినిమా. ఒక పెళ్ళయిన బ్రామ్మలమ్మాయిని లేవదీసుకుపోవటానికి దళితుడు రెడీ అయ్యాడు. పూజారిగారు దొడ్డ మనసుతో పంపించారు. ఇదే కథని రివర్స్ చేసి దళితవాడలో ఒక బ్రామ్మల కుర్రాడు దళిత యువతిని లేవదీసుకుపోయేట్లుగా.. అందుకు దళితులందరూ దొడ్డ మనసుతో ఒప్పుకుంటున్నట్లుగా తీయొచ్చు. కానీ విశ్వనాథ్ పొరబాటున కూడా అలా తీయడు. ఆయన ఎజండా అది కాదు.".>>

    కదా...

    ReplyDelete
  46. >>"ఈ సినిమా బ్రామ్మల సినిమా. ఒక పెళ్ళయిన బ్రామ్మలమ్మాయిని లేవదీసుకుపోవటానికి దళితుడు రెడీ అయ్యాడు. పూజారిగారు దొడ్డ మనసుతో పంపించారు. ఇదే కథని రివర్స్ చేసి దళితవాడలో ఒక బ్రామ్మల కుర్రాడు దళిత యువతిని లేవదీసుకుపోయేట్లుగా.. అందుకు దళితులందరూ దొడ్డ మనసుతో ఒప్పుకుంటున్నట్లుగా తీయొచ్చు. కానీ విశ్వనాథ్ పొరబాటున కూడా అలా తీయడు. ఆయన ఎజండా అది కాదు.".>>

    నిజమే కదా...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.